Narendra Modi: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి.. ప్రధాని నరేంద్ర మోదీ స్పందన
ABN , Publish Date - Jul 14 , 2024 | 09:05 AM
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. 'నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అమెరికా(america) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఘోరమైన దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు(shooting) జరుగగా, ఆయన కుడి చెవికి తీవ్రంగా గాయమైంది. బట్లర్ వేదికపై ఆయన మాట్లాడుతుండగా తుపాకీ పేలిన శబ్ధం వినిపించింది. ఆ క్రమంలో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రంప్‌పై దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్‌పై కాల్పులు జరిగినప్పుడు ఆయన పిడికిలి బిగించి చేయిని పైకి చూపించారు.
ఆ క్రమంలో ఏజెంట్లు ఆయనను వేదికపై నుంచి కిందకు దించగా, ట్రంప్ చెవి, ముఖంలో రక్తం మరకలు కనిపించాయి. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. అప్పుడు సమయం అమెరికాలో శనివారం సాయంత్రం 6:30. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌కు పశ్చిమాన 35 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే మీడియా నివేదికల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. కానీ ట్రంప్ ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ ర్యాలీ తర్వాత, ఆయన న్యూజెర్సీలోని తన ఆస్తి గురించి బెడ్‌మిన్‌స్టర్‌కి వెళ్లాల్సి ఉంది. ట్రంప్ ఆదివారం విస్కాన్సిన్‌లోని మిల్వాకీని కూడా సందర్శించనున్నారు.
ఇది కూడా చదవండి:
Donald Trump: ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు..
Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?
For Latest News and National News