Share News

New Delhi: న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన మరో ఎయిర్‍పోర్ట్

ABN , Publish Date - Dec 09 , 2024 | 03:41 PM

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

New Delhi: న్యూఢిల్లీలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన మరో ఎయిర్‍పోర్ట్

న్యూఢిల్లీ, డిసెంబర్ 09: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అందుకోసం సోమవారం నోయిడాలోని జేవర్ విమానాశ్రయంలో తొలిసారిగా విమానాల ట్రయిల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ నగరంలోని జీఎంఆర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల సౌలభ్యం కోసం.. ఢిల్లీ సమీపంలోని నోయిడా శివారులో జేవర్ వద్ద అధునాతన హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రప్రభుత్వం సిద్దం చేస్తోంది.

Also Read: Delhi Assembly Elections: ఆప్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల


నోయిడా ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎన్ఐఏఎల్) పేరుతో కొత్త విమాశ్రయాన్ని నిర్మిస్తుంది. మొత్తం 4 దశల్లో ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ఇప్పటికే మొదటి దశ పూర్తయి కార్యాకలాపాలు నిర్వహించేందుకు ఈ విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఆ క్రమంలోనే నేటి నుంచి విమానాల ల్యాడింగ్, టేకాఫ్ లను పౌర విమానాయాన శాఖ క్షుణ్ణంగా పరీక్షించనుంది. అందులోభాగంగా ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఆ శాఖ అధికారులు సరిదిద్దనున్నారు. ఇక విమానాశ్రయంలో ట్రయల్ రన్ ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. వచ్చే ఏడాది అంటే... 2025, ఏప్రిల్ నుంచి ప్రయాణికులకు ఈ కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రానుంది.

Also Read: హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్ చేరుకున్న విదేశాంగ కార్యదర్శి


ప్రయాణికుల రద్దీ దృష్ట్యా న్యూఢిల్లీలో మరో కొత్త విమానాశ్రయం నిర్మించాలని మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఢిల్లీ నగర శివారుల్లోని నోయిడాలో కొత్త విమానాశ్రయం నిర్మించాలని భావించింది. అందుకోసం.. 2021, నవంబర్ లో ప్రధాని మోదీ ఈ కొత్త విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. జాతీయ రాజధాని ప్రాంతంలో రెండు అతి పెద్ద విమానాశ్రయంగా ఈ జేవర్.. అవతరించనుంది.

Also Read: ఆ కీలక మలుపు లేకుంటే.. జూన్ 2 గెలుపు లేనే లేదు

Also Read: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?


ఇక అసలు అయితే ఈ విమాశ్రయంలో విమానాల రాక పోకలను ఈ ఏడాది సెప్టెంబర్ లోనే ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు తొలత నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఇది మరింత ఆలస్యమైంది. ప్రతి రోజు.. ఈ విమానాశ్రయానికి 65 విమానాలు రాక పోకలు సాగించేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. వాటిలో 62 డోమెస్టిక్, రెండు ఇంటర్నేషనల్ కాగా.. ఒక కార్గో విమానం అని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: కొనసాగుతోన్న వాయిదాల పర్వం.. మూడు కీలక బిల్లుల ఆమోదం!

Also Read: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. కలకలం


ఇక జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హైటెక్ టౌన్ షిప్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. అలాగే ఈ ఎయిర్ పోర్టుకు కేవలం కిలోమీటర్ దూరంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ ఉంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 17వ తేదీ నాటికి కమర్షియల్ విమానాల ప్రారంభిస్తామని ఎన్ఐఏఎల్ సీఈవో అరుణ్ వీర్ సింగ్ వెల్లడించారు.

For National News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 03:46 PM