Share News

Pak terrorists: భారత్ సరిహద్దుల్లో పాక్ 'ఉగ్ర' పన్నాగం, సైన్యం దగ్గరుండి మరీ...

ABN , Publish Date - Jul 22 , 2024 | 06:09 PM

శ్రీనగర్ : భారత్ సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) రెచ్చిపోతోంది. ఎల్ఓసీ (Loc) వెంబడి భారత భూభాగంలోకి దగ్గరుండి మరీ సాయుధ ఉగ్రవాదులను పంపిస్తోంది. వీరికి పాక్ సైనికులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా వెలుగుచూశాయి.

Pak terrorists: భారత్ సరిహద్దుల్లో పాక్ 'ఉగ్ర' పన్నాగం, సైన్యం దగ్గరుండి మరీ...

శ్రీనగర్ : భారత్ సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) రెచ్చిపోతోంది. ఎల్ఓసీ (Loc) వెంబడి భారత భూభాగంలోకి దగ్గరుండి మరీ సాయుధ ఉగ్రవాదులను పంపిస్తోంది. వీరికి పాక్ సైనికులు దిశానిర్దేశం చేస్తు్న్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవల వెలుగుచూడగా, తాజాగా మరికొన్ని ఫోటోలు వెలుగుచూశాయి. మారణాయుధాలతో ఉన్న సుమారు ఐదుగురు ఉగ్రవాదులు, వీరికి గార్డుగా పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) కమండో జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో వేచి ఉండటం ఇందులో కనిపిస్తోంది. భారత సైన్యం కన్నుకప్పి ఎక్కడి నుంచి భారత భూభాగంలోకి చొరబడాలనే దానిపై పాక్ సైనికులు ముందుగానే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని ఈ ఫోటోల్లో స్పష్టమవుతోంది.

Suprme Court: కావడి యాత్రలో పేర్ల ప్రదర్శనపై స్టే.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని 'సుప్రీం' ఆగ్రహం


జమ్మూలో పెరుగుతున్న ఉగ్రదాడులు

జమ్మూ ప్రాంతంలో దశాబ్దాల ఉగ్రవాదాన్ని భారత భద్రతా బలగాలు తుడిచిపెట్టడంతో 2005-2021 మధ్య చాలామటుకు ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే గత నెలరోజులుగా ఉగ్రదాడులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 40 మంది గాయపడ్డారు. జంట సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరిలో గత అక్టోబర్‌లో తిరిగి ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగుచూశాయి. రియాసి, కథువా, దోడాల్లో సెక్యురిటీ పోస్టులపై దాడులు చోటుచేసుకున్నాయి. 2021 నుంచి జమ్మూ రీజియన్‌లో జరిగిన ఉగ్ర సంబంధిత ఘటనల్లో 52 మంది భద్రతా సిబ్బందితో సహా 70 మందికి పైగా ప్రామాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఆర్మీకి చెందిన వారే ఉన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 06:09 PM