Share News

Arvinder Singh: లేదు లేదంటూనే... అర్వీందర్ సింగ్ బిగ్ ట్విస్ట్..

ABN , Publish Date - May 04 , 2024 | 05:16 PM

కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్ష పదవికి గత వారంలో రాజీనామా చేసిన అర్వీందర్ సింగ్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. పార్టీ పదవికి రాజీనామా చేశానే కానీ పార్టీకి కాదంటూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సమయంలో చెప్పిన ఆయన శనివారంనాడు మరో నలుగురు కాంగ్రెస్ నేతలతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు.

Arvinder Singh: లేదు లేదంటూనే... అర్వీందర్ సింగ్ బిగ్ ట్విస్ట్..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్ష పదవికి గత వారంలో రాజీనామా చేసిన అర్వీందర్ సింగ్ (Arvinder Singh Lovely) కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. పార్టీ పదవికి రాజీనామా చేశానే కానీ పార్టీకి కాదంటూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సమయంలో చెప్పిన ఆయన శనివారంనాడు మరో నలుగురు కాంగ్రెస్ నేతలతో కలిసి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీద్ సింగ్ పూరీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయ, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్‌ బీజేపీలో చేరారు.


'ఇండియా' కూటమిలో భాగంగా ఆప్‌తో కాంగ్రెస్ సీట్లు పంచుకోవడంపై అసంతృప్తి ప్రకటిస్తూ లవ్లీ గతవారంలో తన పదవికి రాజీనామా చేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్, వాయవ్య ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్‌ అభ్యర్థిత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. వారు పూర్తిగా ఢిల్లీకి అపరిచితులని. టిక్కెట్ కోసం తాను రాజీనామా చేయలేదని లవ్లీ అప్పట్లో వివరణ ఇచ్చారు. తాను పార్టీ పదవికే కానీ, పార్టీకి రాజీనామా చేయలేదన్నారు.

Lok Sabha Elections 2024: మా అన్న యువరాజైతే ఆయన చక్రవర్తి.. మోదికి ప్రియాంక కౌంటర్


దేశం, ఢిల్లీ ప్రజల కోసం పోరాటం..

కాగా, బీజేపీలో చేరిన అనంతరం అర్వీందర్ సింగ్ లవ్లీ మాట్లాడుతూ, ఢిల్లీ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసిన అనంతరం సన్నిహితులు, వందలాది కాంగ్రెస్ కార్యకర్తలను కలిసినట్టు చెప్పారు. ఇంటికే పరిమితం కాకుండా దేశం కోసం, ఢిల్లీ ప్రజల కోసం పోరాటం సాగించాలని వారంతా తనను కోరినట్టు తెలిపారు. తనతో పాటు ఐదుగురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారని, గత ఐదేళ్లుగా ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను మెరుగుపరచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2024 | 05:16 PM