సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నాం : హర్షకుమార్
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:49 AM
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 1: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాని ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగానికి అతీతంగా ఎస్సీలపై జరుగుతున్న కుట్రకు వ్యతిరేకంగా 3న అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.