Vibhakar Shastri: కాంగ్రెస్‌కు మాజీ ప్రధాని మనుమడు రాజీనామా.. బీజేపీలో చేరిక
ABN , Publish Date - Feb 14 , 2024 | 04:24 PM
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ప్రధాని దివంగత లాల్ బహదూర్ శాస్త్రి మనుమడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీకి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Loksabha Polls) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ప్రధాని దివంగత లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) మనుమడు విభాకర్ శాస్త్రి (Vibhakar Shastri) కాంగ్రెస్ పార్టీకి బుధవారంనాడు రాజీనామా చేశారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు విభాకర్ శాస్త్రి 'ఎక్స్' వేదికగా తెలిపారు. తన తాతగారైన లాల్ బహదూర్ శాస్త్రి ''జై జవాన్ జైకిసాన్'' నినాదాన్ని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీలో చేరుతున్నానని, మోదీ నాయకత్వంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో పలువురు నేతల రాజీనామాలతో సతమతమవుతోంది. అశోక్ చవాన్, మిలంద్ దేవర, బాబా సిద్ధిఖి, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద్, ప్రియాంక చతుర్వేది, సుస్మితా దేవ్, ఆర్‌పీఎన్ సింగ్, జైవీర్ షేర్గిల్ తదితరులు కొద్దికాలంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరారు.