Ex PM Manmohan Singh: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు
ABN , Publish Date - Dec 26 , 2024 | 09:57 PM
Ex PM Manmohan Singh: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వృద్దాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడంతో.. ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని అత్యవసర సేవా విభాగానికి తరలించి వైద్యులు చికిత్స అందిచారు.అక్కడే చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఆసుపత్రి వైధ్య అధికారులు తెలిపారు.
ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఈ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
మరోవైపు కర్ణాటకలోని బెళగావి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) సమావేశాలు గురువారం సాయంత్రం ప్రారంభమైనాయి. నేడు, రేపు ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు
Also Read: ఉపవాస దీక్ష.. బూట్లు ధరించను అంటూ అన్నామలై కీలక నిర్ణయం
Also Read: జగన్ మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట
Also Read: పాన్ 2.0 వెర్షన్‌పై స్పష్టత ఇచ్చిన కేంద్రం
జాతిపిత మహాత్మా గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడిగా బెలగావిలో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ఈ బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశాలను బెళగావిలో ఏర్పాటు చేసిందీ పార్టీ. ఆ క్రమంలో ఈ సమావేశాలకు నవ సత్యాగ్రహ భైఠక్ అని పేరు పెట్టింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో.. ఆయన ఆరోగ్యంపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.
Also Read: పార్క్ నుంచి పారిపోయిన చిరుత.. ఆందోళనలో ప్రజలు
Also Read: రైతు భరోసా నియమ నిబంధనలు ఇవేనా.. ?
Also Read: చర్చ్‌లో పాస్టర్ల మధ్య గొడవ ..వైరల్ అవుతున్న వీడియో
Also Read: అవినాష్‌ను బెదిరించిన జగన్..తొక్కిసలాటకు కారణం ఇదే
Also Read: గర్బిణీ స్త్రీలు ఈ పండ్లు తినవచ్చు
For National News And Telugu News