Kejriwal Arrest: కేజ్రీవాల్ అతడ్ని చూసి నేర్చుకోవాలి.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్ | Giriraj Singh Slams Arvind Kejriwal For Not Resigning CM Post ABK
Share News

Kejriwal Arrest: కేజ్రీవాల్ అతడ్ని చూసి నేర్చుకోవాలి.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్

ABN , Publish Date - Mar 24 , 2024 | 07:07 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ నైతికతను కోల్పోయాడని విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనని అరెస్ట్ చేయడానికి హేమంత్ సోరెన్ (Hemant Soren) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడని, ఈ విషయంలో అతడ్ని చూసి కేజ్రీవాల్ నేర్చుకోవాలని హితవు పలికారు.

Kejriwal Arrest: కేజ్రీవాల్ అతడ్ని చూసి నేర్చుకోవాలి.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ నైతికతను కోల్పోయాడని విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనని అరెస్ట్ చేయడానికి హేమంత్ సోరెన్ (Hemant Soren) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడని, ఈ విషయంలో అతడ్ని చూసి కేజ్రీవాల్ నేర్చుకోవాలని హితవు పలికారు. నైతికత అనేది ఒక విషయమని, కేజ్రీవాల్ అది కోల్పోయారని దుయ్యబట్టారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

కేజ్రీవాల్ నైతికత ముసుగులో అన్నా హజారేతో (Anna Hazare) కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారని, ఇప్పుడేమో జైల్లో ఉండి ప్రభుత్వం నడపడాన్ని చట్టం నిషేధించదని చెప్తున్నాడని గిరిరాజ్ సింగ్ తూర్పారపట్టారు. తమని తాము నిఖార్సైన నిజాయితీపరులుగా చెప్పుకున్న వ్యక్తులే ఇప్పుడు అవినీతిపరులుగా పిలబడుతున్నారని అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై (Aam Admi Party) మండిపడ్డారు. గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) జైలుకి వెళ్లినప్పుడు.. ఆయన తన భార్యని ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు. కేజ్రీవాల్ కూడా రాజీనామా చేసి, అతని భార్యని సీఎం చేయాలని సలహా ఇచ్చారు. ఈ అంశంలో హేమంత్ సోరెన్‌ని చూసి కేజ్రీవాల్ నేర్చుకోవాలని సూచించారు.

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో (Money Laundering Case) అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. మార్చి 28వ తేదీ వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన శనివారం ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. అరెస్టు, రిమాండ్ ఆర్డర్ రెండూ చట్టవిరుద్ధమని, తనని వెంటనే కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. సార్వత్రిక ఎన్నికలు (2024 Elections) సమీపిస్తున్న తరుణంలో కేజ్రీవాల్ ఇలా అరెస్ట్ అవ్వడం.. ఆయన పార్టీకి, ఇండియా కూటమికి (INDIA Alliance) పెద్ద దెబ్బ తగిలినట్లయ్యింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 07:07 PM