Share News

RG Kar Medical College Student: ప్లీజ్.. మా కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి

ABN , Publish Date - Oct 22 , 2024 | 06:00 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి లేఖ రాశారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజ్జప్తి చేశారు. తమ కోసం కొన్ని నిమిషాలు కేటాయించాలంటూ అమిత్ షాను అభ్యర్థించారు.

RG Kar Medical College Student: ప్లీజ్.. మా కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి

కోల్‌కతా, అక్టోబర్ 22: తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన ట్రైయినీ వైద్యురాలి తండ్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు హత్యాచార బాధితురాలి తండ్రి మంగళవారం లేఖ రాశారు. తమ కుమార్తెను అత్యంత దారుణ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తాము విపరీతమైన మానసిక ఒత్తిడితోపాటు నిస్సహాయ భావనలో ఉన్నామని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. మీరు ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రదేశంలో తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన తాము వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు.

Also Read: Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?


తానతోపాటు తన భార్య సైతం అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తే.. వెళ్లి కలుస్తామన్నారు. తమకు అమిత్ షా మార్గదర్శనం చేయడంతోపాటు సహాయం సైతం చేస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కోసం కొన్ని నిమిషాలు కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమిత్ షా అపాయింట్‌మెంట్‌పై బాధితురాలి తల్లి స్పందించారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తారని తాము చాలా ఆశాజనకంగా ఉన్నామన్నారు. అమిత్ షాతో సమావేశమైతే.. తమకు న్యాయం చేయాలని ఆయన్ని కోరతామన్నారు. అలాగే తమకు మార్గనిర్దేశం చేయాలని కూడా అడుగుతామని చెప్పారు.

IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు


ఈ ఏడాది ఆగస్ట్ 9వ తేదీన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మృతిరాలికి న్యాయం జరగాలి.. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలి... అలాగే పని ప్రదేశాల్లో వైద్య సిబ్బందికి భద్రత చర్యలు చేపట్టాలని పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు ఈ ఘటన జరిగిన నాటి నుంచి ఆందోళన చేస్తున్నారు.

Also Read: Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?


వారితో మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ సమయంలో వారి డిమాండ్లను ప్రభుత్వం ముందు జూనియర్ డాక్టర్లు ఉంచారు. వాటిలో కొన్నింటిని అమలు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో జూనియర్ డాక్టర్లు.. తమ సేవలను పాక్షికంగా నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే డిమాండ్ల అమలులో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళన బాట చేపట్టారు. ఆ ఆందోళన నేటికి కొనసాగుతుంది.

Also Read: ఇవి తింటే.. జుట్టు ఊడదు..


మరోవైపు ఈ హత్యాచార ఘటనకు సంబంధించిన దర్యాప్తును సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అప్పగించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ అని ఇప్పటికే కోర్టుకు సమర్పించిన తన నివేదికలో సీబీఐ స్పష్టం చేసింది. ఇంకోవైపు.. కుమార్తెను కోల్పోయి.. ఆ తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు మార్గనిర్దేశనం చేయాలంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు ఈ మెయిల్ ద్వారా మంగళవారం బాధితురాలి తండ్రి లేఖ రాశారు.

For National News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 06:04 PM