Jharkhand: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ABN , Publish Date - Sep 30 , 2024 | 08:58 PM
జార్ఖాండ్‌లోని సరాయకేలా జిల్లా ఛాందిల్ స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవాంతరం కలిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో రైల్వే ట్రాక్ బాగా దెబ్బతింది.
రాంచీ: జార్ఖాండ్ (Jharkhand)లోని సరాయకేలా జిల్లా ఛాందిల్ స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు (goods train) పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవాంతరం కలిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో రైల్వే ట్రాక్ బాగా దెబ్బతింది. దీంతో టాటానగర్ స్టేషన్ నుంచి అన్ని రైళ్ల రాకపోలలను రద్దు చేశారు. హతితాయ ఎక్స్‌ప్రెస్, గోడ్డా ఎక్స్‌ప్రెస్‌లను సైతం రద్దు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు టాటా నగర్ స్టేషన్‌లోనే నిలిచిపోయారు. వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు స్టేషన్‌లోనే చంద్రధర్‌పూర్ రైల్వే డివిజన్ ఒక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాద స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు.
Railways: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. మీ కోసం కొత్త రూల్స్.. ఇకపై రైళ్లలో మీరు..
కాగా, సెప్టెంబర్ 26న కూడా జార్ఖాండ్‌లోని బొకారో వద్ద గూడ్సు రైలుకు చెందిన రెండు బోగాలు పట్టాలు తప్పాయి. దీంతో దాదాపు 15 రైళ్లు రద్దయ్యాయి. బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున ఇనుప సామగ్రిని తీసుకు వెళ్తుండగా తుప్కాడిహ్, బొకారో స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది.
ఇది కూడా చదవండి..