Govinda: ఆసుపత్రి నుంచి నటుడు గోవిందా డిశ్చార్జి
ABN , Publish Date - Oct 04 , 2024 | 03:17 PM
ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీలో బయటకు వచ్చిన గోవిందా తాను కోలుకోవాలని ప్రార్థించిన మీడియాకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నిలుచుని ఫోటోలు దిగారు.
ముంబై: నాలుగు రోజుల చికిత్స అనంతరం బాలీవుడ్ నటుడు గోవింద (Govinda) శుక్రవారం మధ్యాహ్నం ముంబైలోని క్రిటికేర్ ఆసియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీల్ చైర్‌పై ఆయనను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువచ్చారు. గోవింద్ భార్య సునిత అహుజా కూడా ఆయన వెంటే ఉన్నారు.
గోవిందా గత మంగళవారంనాడు ముంబై నుంచి కోల్‌కతా బయలుదేరే హడావిడిలో ఉండగా ఇంటిలోనే పొరపాటును ఆయన రివాల్వర్ జారిపడి బుల్లెట్ దూసుకువచ్చింది. ఆయన ఎడమికాలి మోకాలి కింద బుల్లెట్ గాయమైంది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా కాలి నుంచి బుల్లెట్‌ను తొలగించారు.
NCP MLA Jumped Matralaya: సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకిన ఎమ్మెల్యే
అందరికీ కృతజ్ఞతలు తెలిపిన గోవిందా
ఆసుపత్రి నుంచి చక్రాల కుర్చీలో బయటకు వచ్చిన గోవిందా తాను కోలుకోవాలని ప్రార్థించిన మీడియాకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నిలుచుని ఫోటోలు దిగారు. తనను చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన అభిమానులకు చేతులు ఊపుతూ ఆప్యాయంగా గాలిలోకి ముద్దులు విసిరారు. దీనికి ముందు, ఉదయమే ఆసుపత్రికి చేరుకున్న సునితా అహుజా తన భర్త సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు చెప్పారు. సురక్షితంగా ఇంటికి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పారు. కనీసం ఆరు వారాల పాటు బెడ్‌రెస్ట్ తీసుకోవాలని వైద్యులు గోవిందాకు సూచించినట్టు తెలిపారు. ఎక్కువ మందిని కలుసుకోరాదని, ఇందువల్ల ఇన్‌ఫెక్షన్ ప్రమాదం పెరగవచ్చని కూడా వైద్యులు సూచించారని అన్నారు.
For Latest news and National news click here
ఇది కూడా చదవండి...