GST Council Meet: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ తగ్గింపు: నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Jun 22 , 2024 | 09:09 PM
చిరు వ్యాపారులకు మేలు చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌లో పలు అంశాలపై చర్చించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పేర్కొన్నారు. కేంద్రం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండగా నిర్మలా అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council Meet) జరిగింది.
ఢిల్లీ: చిరు వ్యాపారులకు మేలు చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్‌లో పలు అంశాలపై చర్చించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పేర్కొన్నారు. కేంద్రం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుండగా నిర్మలా అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం(GST Council Meet) జరిగింది. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ..
‘‘జీఎస్టీ చివరి సమావేశం అక్టోబర్‌లో జరిగింది. అజెండాలోని అంశాలపై ఇంకోసారి సమావేశం అవుతాం. ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులుగా కౌన్సిల్ భేటీ జరగలేదు. జీఎస్టీ మండలిలో అనేక విషయాలు చర్చించాం. ఆగస్టు చివరి వారం మళ్లీ భేటీ అవుతాం. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తాం. జీఎస్టీపై ట్రిబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచాం. ఈసారి భేటీలో పన్నులు కట్టేవారి కోసం, చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చాం. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలున్నాయి. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు మాకు వచ్చాయి.
సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించింది. జీఎస్టీ కట్టేందుకు చివరితేదీ గడువు పొడిగించాం. ఈ నిర్ణయాలతో వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి జరుగుతుంది. అక్రమాలు జరగకుండా ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేయాలని నిర్ణయించాం. ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ విషయంలో మార్పులు చేస్తాం’’ అని నిర్మలా పేర్కొన్నారు. ఇవాళ చర్చించిన అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత మరోమారు చర్చ నిర్వహించి జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుందని నిర్మలా స్పష్టం చేశారు.
మరిన్ని నిర్ణయాలు..
విద్యా సంస్థలకు చెందిన హాస్టళ్లలో కాకుండా బయట ఉంటున్న వాళ్లు వరుసగా 90 రోజులు ఒకే హాస్టల్‌లో ఉంటే నెలకు రూ.20 వేల వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది.
రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్ టికెట్లు, వెయిటింగ్ రూమ్, క్లాక్ రూమ్, బ్యాటరీ కారు సేవలపై జీఎస్టీ తొలగిస్తాం.
స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ.
స్ప్రింకర్లు, సోలార్ కుక్కర్‌లపై, కార్టన్ బాక్సులపై 12 శాతానికి జీఎస్టీని తగ్గిస్తాం.
Read Latest Telangana News and National News