Share News

గైడెడ్‌ పినాక సామర్థ్య పరీక్ష విజయవంతం

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:39 AM

భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరనుంది. గైడెడ్‌ పినాక ఆయుధ వ్యవస్థ సామర్థ్య పరీక్షలన్నీ పూర్తి చేసుకుని సైన్యంలో చేరడానికి సిద్ధమైంది.

గైడెడ్‌ పినాక సామర్థ్య పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ, నవంబరు 15: భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరనుంది. గైడెడ్‌ పినాక ఆయుధ వ్యవస్థ సామర్థ్య పరీక్షలన్నీ పూర్తి చేసుకుని సైన్యంలో చేరడానికి సిద్ధమైంది. పీఎ్‌సక్యూఆర్‌ ధ్రువీకరణల్లో భాగంగా గైడెడ్‌ పినాక ఆయుధ వ్యవస్థ సామర్థ్య పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్‌డీవో ఓ ప్రకటనలో పేర్కొంది. విభిన్న క్షేత్రస్థాయి ఫైరింగ్‌ రేంజ్‌ల్లో మూడు దశల్లో ఈ పరీక్షలను పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఈ రాకెట్‌ పరీక్షల్లో దూరం, కచ్చితత్వం, నిలకడ, వివిధ లక్ష్యాల విషయంలో కాల్పుల శాతాన్ని మదించినట్లు తెలిపింది. ఒక్కో ప్రొడక్షన్‌ ఏజెన్సీ నుంచి 12 రాకెట్లు, ఉన్నతీకరించిన రెండు పినాక లాంచర్లను పరీక్షించినట్లు డీఆర్‌డీవో పేర్కొంది. పినాక మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ వ్యవస్థ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారైంది.

Updated Date - Nov 16 , 2024 | 03:39 AM