Harayana : హరియాణాకు కేజ్రీవాల్ ఐదు గ్యారెంటీలు
ABN , Publish Date - Jul 21 , 2024 | 05:20 AM
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ హరియాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ ఐదు గ్యారెంటీలను శనివారం ప్రకటించారు. బాలబాలికలకుఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, 24 గంటలు ఉచిత విద్యుత్తు...
ఉచిత విద్య, వైద్యం, విద్యుత్తు.. ప్రతి మహిళకు రూ.1000
ప్రకటించిన కేజ్రీవాల్ సతీమణి
పంచకుల(హరియాణా), జూలై 20 : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ హరియాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ ఐదు గ్యారెంటీలను శనివారం ప్రకటించారు. బాలబాలికలకుఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, 24 గంటలు ఉచిత విద్యుత్తు, రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000, యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన ఈ ఐదు గ్యారెంటీల్లో ఉన్నాయి.
హరియాణా అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబరులో ఎన్నికలు జరగనున్నాయి. పంచకులలో ఈ ఐదు గ్యారెంటీల ప్రకటన కార్యక్రమానికి కేజ్రీవాల్ సతీమణితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్, ఆప్ సీనియర్ నేతలు సంజయ్ సింగ్, సందీప్ పాఠక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ... కేజ్రీవాల్ చేపడుతోన్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ఆయన్ను ప్రధాని మోదీ జైలు పాలు చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ హరియాణా బిడ్డ అని, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదని ప్రజలను కోరారు. ఇది కేజ్రీవాల్ సమస్య కాదని... హరియాణా గౌరవానికి సంబంధించిన విషయమన్నారు. తాము గెలిస్తే గృహాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని, 24 గంటలూ విద్యుత్తు సరఫరా ఉంటుందని చెప్పారు.