Harbhajan Singh: దీదీ, బెంగాల్ గవర్నర్‌కు హర్బజన్ లేఖ
ABN , Publish Date - Aug 18 , 2024 | 06:02 PM
కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతురాలికి న్యాయం జరగాలని, వీలైనంత త్వరగా నిందితుడిని ఉరి తీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
కోల్ కతా: కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతురాలికి న్యాయం జరగాలని, వీలైనంత త్వరగా నిందితుడిని ఉరి తీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ (Harbhajan Singh)రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
లేఖ..
కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఈ నెల 9వ తేదీన ట్రైనీ వైద్యురాలిపై సామూహిక లైంగికదాడి జరిగింది. సెమినార్ హాల్‌లో వైద్యురాలు విగతజీవిగా కనిపించింది. 12 గంటల్లో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్జీ షీట్ ఫైల్ చేసి, వెంటనే నేరం రుజువు చేయాలని యావత్ దేశం భావిస్తోంది. ఆ క్రమంలో దీదీకి హర్భజన్ సింగ్ కూడా లేఖ రాశారు. ఆ లేఖలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మాట రావడం లేదు
‘వైద్యురాలిపై జరిగిన ఘటన గురించి మాట్లాడేందుకు నోట మాట రావడం లేదు. ఆ ఘటన ఒక్క నన్నే కాదు అందరిని షాక్‌నకు గురిచేసింది. ఇది ఒక మహిళపై జరిగిన హేయనీయమైన చర్య. దీంతో సమాజంలో మిగతా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఘటన తర్వాత మన వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సరిచేయాల్సి ఉంది. ఇదే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది అని’ లేఖలో హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. ఆ లేఖను సోషల్ మీడియా ఎక్స్‌లో హర్భజన్ సింగ్ షేర్ చేశారు.
అలాంటి చోట..
‘ఆస్పత్రి ప్రాంగణంలో లైంగికదాడి జరగడం దారుణం. ఆ చోట రోగుల ప్రాణాలను కాపాడుతారు. ఆ ఘటన ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ నన్ను షాన్‌నకు గురిచేసింది అని’ హర్భజన్ సింగ్ అభిప్రాయ పడ్డారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్న ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైద్యులు, సిబ్బంది రహదారుల మీదకొచ్చి ఆందోళన చేస్తోన్న పట్టించుకోవడం లేదని హర్భజన్ సింగ్ మండిపడ్డారు.
Read More National News and Latest Telugu News