Share News

Haryana Assembly Elections: మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:28 PM

దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో మాట్లాడుతుండగా కొందరు అగంతకులు గలభా సృష్టించి కాన్వాయ్‌పై ఇటుకలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఒక వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు.

Haryana Assembly Elections: మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి

జింద్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elections) ప్రచారంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జింద్ జిల్లా ఉచన కలాన్‌లో జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా (Dushyant Chautala) కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.


దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో మాట్లాడుతుండగా కొందరు అగంతకులు గలభా సృష్టించి కాన్వాయ్‌పై ఇటుకలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఒక వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. దుష్యంత్‌తో పాటు ఆజాద్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ చంద్రశేఖర్ కూడా ఉచానాలో జరిగిన రోడ్‌షో పాల్గొన్నారు. ఉచానా అసెంబ్లీ నియోజకవర్గంని చౌతాలా పోటీ చేస్తున్నారు. చౌతాలా 2019లో ఇక్కడి నుంచి గెలిచారు. 2014లో బీజేపీ అభ్యర్థి ప్రేమ్‌లత చేతిలో ఓడిపోయారు. ఈసారి చౌతాలాపై బీజేపీ అధ్యర్థి చతర్భుజ్ అట్టారి (బీజేపీ), బ్రిజేంద్ర సింగ్ (కాంగ్రెస్) పోటీ చేస్తున్నారు.

Kerala Express: విరిగిన పట్టాలపై దూసుకెళ్లిన రైలు.. తప్పిన భారీ ప్రమాదం


ఈసీకి లేఖ రాస్తా

జింద్‌లో తన కాన్వాయ్‌పై దాడి ఘటనపై దుష్యంత్ చౌతాలా స్పందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అంతా వారి దగ్గర ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఎన్నికల కమిషన్‌కు తప్పనిసరిగా లేఖ రాస్తామని చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి, గత రెండు ఎన్నికల్లోనూ తనపై దాడులు జరుగుతూనే ఉన్నారయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ప్రత్యేక నిఘా బృందాన్ని ఇక్కడకు పంపాలని కోరారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఓకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Updated Date - Oct 01 , 2024 | 03:28 PM