Haryana: హర్యానాలో బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఇదే
ABN , Publish Date - Oct 11 , 2024 | 04:07 PM
హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీజేపీ సీనియర్ నేత నయబ్ సింగ్ సైనీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) వరుసగా మూడోసారి విజయాన్ని సాధించిన బీజేపీ (BJP) కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 15వ తేదీన పంచకుల (Panchkula)లో ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని పంచకుల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ యష్ గార్గ్ తెలిపారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 10 మంది సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి యష్ గార్గ్ నేతృత్వం వహిస్తున్నారు.
హర్యానా కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. గత మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీజేపీ సీనియర్ నేత నయబ్ సింగ్ సైనీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఆయన సారథ్యంలోనే బీజేపీ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. పార్టీ గెలిస్తే సైనీనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ సైతం సంకేతాలిచ్చింది.
Jammu and Kashmir: ఆప్ మద్దతు ఆ పార్టీకే.. ఎల్జీకి లేఖ సమర్పణ
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మొత్తం 90 సీట్లలో 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఇండిపెండెంట్లు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ప్రకటించారు.
For National News And Telugu News
ఇది కూడా చదవండి...