Share News

Haryana Exit Polls 2024: హర్యానాలో గెలిచేది ఆ పార్టీనే.. సంచలన రిపోర్ట్..

ABN , Publish Date - Oct 05 , 2024 | 06:21 PM

Haryana Exit Polls 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలయ్యాయి. హర్యానాలో ఏ పార్టీ గెలువబోతోంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే కీలక వివరాలను సర్వే సంస్థలు వెల్లడించాయి. ఆ వివరాల కోసం ఈ కథనం చదవాల్సిందే..

Haryana Exit Polls 2024: హర్యానాలో గెలిచేది ఆ పార్టీనే.. సంచలన రిపోర్ట్..
Haryana Exit Polls

న్యూఢిల్లీ, అక్టోబర్ 05: హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రకటించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్- 55, బీజేపీ- 26, ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 46 సీట్లు కైవసం చేసుకోవాలి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ప్రకటించింది. తన ప్రత్యర్థి బీజేపీపై 7 నుంచి 8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.


పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్‌ఎల్డీ-బీఎస్పీ కూటమికి 5.2 శాతం, ఆప్‌ పార్టీకి 1 శాతం, జేజేపీకి 1 శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రిగా ఆయనకే ఓటు..

సీఎం ఎవరైతే బాగుంటుందన్న అంశంపైనా ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు 6 శాతం మంది ఈ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావాలని మద్దతిస్తున్నారని పీపుల్స్‌పల్స్‌ పేర్కొంది.


హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీలు బలహీనపడ్డాయని సర్వే నివేదికలో పేర్కొంది. ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావితం చేశాయని అంచనా వేసింది. స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు ఓటు వేశారని పీపుల్స్ పల్స్‌ తెలిపింది. ఓటర్లు జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదు. వీటికి తోడు.. నిరుద్యోగం, అగ్నీవీర్ పథకం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల.. హర్యానాలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా రాష్ట్రంలో రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.


Also Read:

కంటెంట్‌లో కల్తీ.. కేరాఫ్ సాక్షి..

హైడ్రా ఇక తగ్గేదే లే.. మరిన్ని పవర్స్..

ఎప్పుడూ నవ్వించే అతన్ని ఎలా ఓదార్చాలి..

For More National News and Telugu News..

Updated Date - Oct 05 , 2024 | 06:39 PM