Share News

Haryana polls: వినేశ్‌పై పోటీకి బైరాగిని నిలిపిన బీజేపీ

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:34 PM

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారాన్ని అందుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచీ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి.. వారిని సైతం బరిలో నిలుపుతుంది.

Haryana polls: వినేశ్‌పై పోటీకి బైరాగిని నిలిపిన బీజేపీ

హరియాణా, సెప్టెంబర్ 10: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారాన్ని అందుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆచి తూచీ వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి.. వారిని సైతం బరిలో నిలుపుతుంది.

Also Read: Madhya Pradesh: ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి.. యూపీలో మరో తోడేలు పట్టివేత


తాజాగా జల్నా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థిగా హరియాణా యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌ కెప్టెన్ యోగేశ్‌ బైరాగిని బీజేపీ బరిలో నిలిపింది. మంగళవారం బీజేపీ.. 21 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసిన విషయం విధితమే.

Also Read: Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు


మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెల్లువడనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది.

Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు

Also Read: Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?


అయితే బీజేపీని ఓడించేందుకు ఆప్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వెళ్తుందంటూ నిన్న మొన్నటి వరకు ఓ ప్రచారం అయితే గట్టిగానే జరిగింది. కానీ సీట్ల సర్దుబాటు విషయంలో ఈ పార్టీల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఆప్ 10 అసెంబ్లీ స్థానాలు కోరితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం 5 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: Kolkata doctor's mother: సీఎం మమత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హత్యాచార వైద్యురాలి తల్లి

Also Read: West Bengal: మమత ప్రభుత్వంలో ‘అవినీతి’పై మాజీ ఎంపీ ఆరోపణలు


దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఒంటరిగానే బరిలో దిగనున్నాయి. గత వారం ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని పరిశీలకులు సైతం స్పష్టం చేస్తున్నారు.


ఐఎన్‌ఎల్‌డీలోచేరిన ఆదిత్య చౌతాలా..

టిక్కెట్ కేటాయించకపోవడంతో ఆదిత్య చౌతాలా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం ఆయన ఐఎన్‌ఎల్‌డీలో చేరారు. అనంతరం ఆదిత్యకు దబ్వాలి అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఇక వివిధ పార్టీల్లో టికెట్ దక్కని నేతలపై ఐఎన్‌ఎల్‌డీతోపాటు బీఎస్సీ, జేజేపీ, ఏఎస్పీ పార్టీలు దృష్టి సారించాయి.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 10 , 2024 | 05:33 PM