Share News

Sweeper Posts: స్వీపర్‌ పోస్టులకు 1.7 లక్షల దరఖాస్తులు

ABN , Publish Date - Sep 06 , 2024 | 05:17 AM

హరియాణాలో నిరుద్యోగ తీవ్రతకు ఇదో నిదర్శనం. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలో స్వీపర్‌ పోస్టుల కోసం సుమారు 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Sweeper Posts: స్వీపర్‌ పోస్టులకు 1.7 లక్షల దరఖాస్తులు

  • వీరిలో 6వేలకుపైగా పోస్టు గ్రాడ్యుయేట్లు

  • 40వేల మంది గ్రాడ్యుయేట్లు

చండీగఢ్‌, సెప్టెంబరు 5: హరియాణాలో నిరుద్యోగ తీవ్రతకు ఇదో నిదర్శనం. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలో స్వీపర్‌ పోస్టుల కోసం సుమారు 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసిన వారిలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు. 6వేలమందికిపైగా పోస్టు గ్రాడ్యుయేట్లు, సుమారు 40వేల మంది గ్రాడ్యుయేట్లు అప్లికేషన్లు సమర్పించారు. స్వీపర్‌కు ఇచ్చే నెల జీతం రూ.15వేలు కావడం గమనార్హం. ప్రభుత్వ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థ అయిన హరియాణా కౌశల్‌ రోజ్‌గార్‌ నిగం లిమిటెడ్‌ (హెచ్‌కేఆర్‌ఎన్‌) ఆగస్టు ఆరో తేదీ నుంచి సెప్టెంబరు రెండో తేదీ వరకు స్వీకరించిన ధరఖాస్తుల్లో ఈ విషయం వెల్లడయింది.


పీజీ, బిజినెస్‌ స్టడీ్‌సలో డిప్లొమో చేసిన మనీష్‌ కుమార్‌ కూడా ఈ పోస్టు కోసం దరఖాస్తు చేశారు. ప్రయివేటు సంస్థలు, పాఠశాలల్లో నెలకు రూ.10 వేలు మించి ఇవ్వడం లేదని, భవిష్యత్తులో రెగ్యులర్‌ ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా లేకపోవడంతో ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. స్వీపర్‌ అంటే రోజంతా చేయాల్సిన ఉద్యోగం కాదని, ఇతర పనులు చేసుకోవచ్చన్న ఉద్దేశంతో దీనిపై ఆశ పెంచుకున్నట్టు తెలిపారు. రోహ్‌తక్‌లోని సుఖ్‌పుర్‌ చౌక్‌ చెందిన సుమిత్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు. దాంతో చివరి ప్రయత్నం కింద ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు.

Updated Date - Sep 06 , 2024 | 05:17 AM