Share News

Lok Sabha Polls: గుజరాత్‌లో బీజేపీ గాలీ లేదు.. ఎదురుగాలీ లేదు!

ABN , Publish Date - May 06 , 2024 | 03:58 AM

ఇదీ సొంతంగా మేం సాధించిన ఘనత అని ఓటర్లకు చెప్పుకొనేందుకు ఏమీలేదు..! పదేళ్ల కిం దటి ‘మనవాడు ఒకరు తొలిసారి దేశ ప్రధాని కాబోతున్నాడు’ అనే వేవ్‌ కూడా లేదు..! ఐదేళ్లక్రితం నాటి జాతీయవాద ఉధృత పవనాలూ లేవు..! అలాగని వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు..! ఇదీ గుజరాత్‌లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి..!

Lok Sabha Polls: గుజరాత్‌లో బీజేపీ గాలీ లేదు.. ఎదురుగాలీ లేదు!

  • కమలానికి పలుచోట్ల కాంగ్రెస్-ఆప్‌ నుంచి సవాలు

  • కాషాయ పార్టీ పైన కత్తి దూస్తున్న క్షత్రియులు

  • అభ్యర్థుల ఎంపికలో సమర్థంగా వ్యవహరించిన హస్తం

ఇదీ సొంతంగా మేం సాధించిన ఘనత అని ఓటర్లకు చెప్పుకొనేందుకు ఏమీలేదు..! పదేళ్ల కిం దటి ‘మనవాడు ఒకరు తొలిసారి దేశ ప్రధాని కాబోతున్నాడు’ అనే వేవ్‌ కూడా లేదు..! ఐదేళ్లక్రితం నాటి జాతీయవాద ఉధృత పవనాలూ లేవు..! అలాగని వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు..! ఇదీ గుజరాత్‌లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి..! తీవ్ర అసంతృప్తిలో సీనియర్‌ నేతలు.. గతంలోలా పార్టీని గెలిపించాలన్న కసిలేని కార్యకర్తలు..! వెరసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మం త్రి అమిత్‌ షా సొంత రాష్ట్రంలో బీజేపీకి బీజేపీనే ప్రత్యర్థి..! 25ఏళ్ల నుంచి గుజరాత్‌ను కాషాయ పార్టీనే పాలిస్తోంది. పవర్‌ పాలిటిక్స్‌, జిత్తులతో అధికారాన్ని గుప్పిట పట్టిన వైనంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయితే ఓటేసేందుకు వారికి బీజేపీని మించిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. గత 2 లోక్‌సభ ఎన్నికల్లోలాగానే ఈసారీ 26 స్థానాల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ స్వీప్‌ చేయాలని ఆ పార్టీ లక్ష్యం పెట్టుకుంది. కానీ, ఇది కష్టమేననే విశ్లేషణలు వస్తున్నాయి. సూరత్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడం, స్వతంత్రులూ తప్పుకోవడంతో ఈ స్థానం ఎన్నికలేకుండానే బీజేపీ వశమైంది. మిగిలిన 25 సీట్ల కు ఈ నెల7న ఒకే విడతలో పోలిం గ్‌ జరగనుంది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ 24 సీట్లలో, ఆప్‌ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక గుజరాత్‌ అంటే దాదా పు 3దశాబ్దాలుగా బీజేపీ అడ్డా.

మోదీ వచ్చాక అది మరింత బలపడింది. ఇలాంటిచోట సీట్లు తగ్గితే ఇబ్బంది అని భావించారో..? శ్రేణు ల్లో ఉదాసీనతను గమనించారో కానీ, బీజేపీ పెద్దలు గెలుపు కాదు.. అభ్యర్థులందరికీ 5 లక్షలపైగా మె జార్టీ మన లక్ష్యమంటూ టార్గెట్‌ పెట్టారు. అమిత్‌షా గత ఎన్నికల్లో గాంధీనగర్‌ నుంచి 5.57 లక్షల ఓట్ల తో నెగ్గగా, ఈసారి 10 లక్షల ఆధిక్యంతో గెలిపించాలని నిర్దేశించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 13 లక్షలే. మోదీ ప్రభుత్వ పనితీరు, బీజేపీ వార్‌ రూమ్‌ వ్యూహాలతో ఓటింగ్‌ శాతం పెరిగినా ప్రతి అభ్యర్థి 5లక్షలపైగా ఓట్లతో నెగ్గడం సాధ్యంకాదని విశ్లేషకులు వివరిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రులు పురుషోత్తం రూపాలా, మన్‌సుఖ్‌ మాండవీయ అమ్రేలీ, భావ్‌నగర్‌ నుంచి పోటీ చేస్తుండటం కార్యకర్తలకు నచ్చలేదు. మొత్తంగా చూస్తే బీజేపీ కార్యకర్తల్లో కనిపించే ఎన్నికల దూకుడు ఈసారి లేదనేది రాజకీయ విశ్లేషకులమాట. ఇక క్షేత్రస్థాయిలో నాయకత్వం బలహీన పడడంతో గుజరాత్‌ కాం గ్రెస్‌ చాలాచోట్ల బీజేపీని సవాల్‌ చేయలేకపోతోంది.


విశేష ఆదరణ ఉన్న కాం గ్రెస్‌ నాయకులు గత పదేళ్ల నుంచి బీజేపీలోకి వరుస కడుతున్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మే కార్యకర్తలు, ఓటర్లు ఉన్నప్పటికీ సొమ్ము చేసుకోలేకపోతోంది. బీజేపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో వెనుకబడుతోంది. ఈసారి అలా జరగకుండా చూసుకోవాల్సి ఉంది. కాగా బ్రిటిష్‌ వారితో రోటీ-బేటీ ఒప్పందం చేసుకుని.. మనుగడకు ముప్పు రాకుండా చూసుకున్నారంటూ క్షత్రియులపై పురుషోత్తం రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆవర్గం వారు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. రూపాలా క్షమాపణ చెప్పినా వారు శాంతించలేదు. వారు బీజేపీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా, 6.5కోట్ల గుజరాత్‌ జనాభాలో 11-12శా తమున్న పటీదార్లు ఈసారీ బీజేపీవైపే ఉన్నారంటున్నారు. ఠాకూర్లు, కోలీలు తదితర బీసీలు 40ు వరకున్నారు. బీజేపీ ఆరుగురు పటీదార్లకు టికెటివ్వగా, కాంగ్రె్‌స-ఆప్‌ ఏడుగురిని నిలిపింది. బీజేపీ ముగ్గురు కోలీలు, ఏడుగురు ఓబీసీలకు సీట్లిస్తే, కాంగ్రె్‌స-ఆప్‌ ఏడుగురు బీసీలు, ఇద్దరు కోలీలను దింపింది. ఇక గుజరాత్‌ సీఎంగా ఎవరున్నా అక్కడి బీజేపీనేతలు మోదీపైనే ఆశలు పెట్టుకుంటారు. ఈసారీ అదే జరుగుతోంది. ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి పదవులకు రాజీనామా చేయడంతో గుజరాత్‌లో 5 అసెంబ్లీ స్థానాలకు మే 7న ఉప ఎన్నిక జరగనుంది


రాహుల్‌ యాత్రతో కాంగ్రె్‌సకు ఆశావహ పరిస్థితులు

గుజరాత్‌లో గతంలోకంటే కాంగ్రెస్‌ పరిస్థితి ఆశావహంగా ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. అగ్రనేత రాహుల్‌గాంధీ న్యాయ్‌ యాత్రతో పార్టీ పట్ల సానుకూలత ఏర్పడిందని, కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు. కొన్నిచోట్ల తప్ప..పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల్లో ఆదరణ ఉన్న అభ్యర్థులను ఈ సారి కాంగ్రెస్‌ పోటీకి నిలిపింది. కార్యకర్తలూ కష్టపడుతున్నారు.

బనస్కాంత, సబర్‌కాంత, పటాన్‌, ఆనంద్‌, భరూచ్‌, వల్సాద్‌, సౌరాష్ట్రలోని అమ్రేలీ, సురేంద్రనగర్‌, జునాగఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ సమరం జరుగుతోంది. దీంతో ఈసారి కాంగ్రె్‌సకు కొన్ని సీట్లు వస్తాయనే భావన వ్యక్తమవుతోంది. ఆప్‌తో పొత్తు. రాష్ట్రవ్యాప్తంగా మంచి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న ఆప్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 13 ఓట్లు సాధించింది. ఇవన్నీ కాంగ్రె్‌సవే. ఇప్పుడు కలిసి పోటీ చేస్తుండడంతో ఓట్ల చీలికపై హస్తం పార్టీ ఆందోళన లేదు. కాగా, తమ అధినేతను బీజేపీ అక్రమంగా అరెస్టు చేసిందనే ఆలోచనతో ఉన్న ఆప్‌ కార్యకర్తలు కసిగా పనిచేస్తున్నారు.

Updated Date - May 06 , 2024 | 07:13 AM