Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ
ABN , Publish Date - Jan 19 , 2024 | 12:09 PM
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) బెయిల్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది.
ఢిల్లీ: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) బెయిల్ పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ సవాలు చేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్వి సభ్య ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.