Arvind Kejriwal: కేజ్రీవాల్‌కి ఊరట దక్కుతుందా.. సీఎం పిటిషన్లపై సుప్రీంలో విచారణ నేడు
ABN , Publish Date - Sep 05 , 2024 | 10:22 AM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజీవాల్(Arvind Kejriwal) బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజీవాల్(Arvind Kejriwal) బెయిల్ పిటిషన్‌తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) సీబీఐకి ఆగస్టు 23 వరకు అనుమతి ఇచ్చింది.
కౌంటర్‌పై సమాధానం ఇచ్చేందుకు కేజ్రీవాల్‌కు రెండురోజుల గడువు ఇచ్చింది. బెయిల్‌తోపాటు సీబీఐ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. అరెస్టుకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న ఇచ్చిన ఆదేశాలను కేజ్రీవాల్ సవాల్ చేశారు.
ఉత్కంఠ..
మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో రిమాండ్‌లో ఉన్న సమయంలోనే జూన్ 26న సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. అయితే కేజ్రీవాల్ కి ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను ఇవ్వగా.. సీబీఐ కోర్టులో ఈ నెల 14న మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.
పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కోర్టు కేజ్రీవాల్‌కి ఊరట కలుగుతుందా లేదా అని ఆప్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈకేసులో సరైన సాక్ష్యాలు పొందుపరచకపోవడంతో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు ఇదివరకే బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
For Latest News click here