Share News

పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్‌ పట్టివేత

ABN , Publish Date - Oct 28 , 2024 | 04:01 AM

పంజాబ్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. పాకిస్థాన్‌ నుంచి జలమార్గం ద్వారా భారత్‌కు తరలిస్తున్న దాదాపు 105 కిలోల హెరాయిన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్‌ పట్టివేత

  • పాక్‌ నుంచి జలమార్గం ద్వారా భారత్‌లోకి.. ఇద్దరి అరెస్టు

అమృత్‌సర్‌, అక్టోబరు 27: పంజాబ్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. పాకిస్థాన్‌ నుంచి జలమార్గం ద్వారా భారత్‌కు తరలిస్తున్న దాదాపు 105 కిలోల హెరాయిన్‌ను ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా. సముద్ర మార్గంలో పెద్ద మొత్తం లో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు ఉప్పందటంతో నిఘా పెట్టి శనివారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. డ్రగ్‌ స్మగ్లర్‌ నవ్‌ బుల్లర్‌ అనుచరులైన నవ్‌జ్యోత్‌సింగ్‌, లవ్‌ప్రీత్‌ కుమార్‌లను బాబా బకాల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. డ్రగ్స్‌ సరాఫరాకు స్మగ్లర్లు జలమార్గాన్ని ఎంచుకున్నారని, వారి నుంచి పెద్ద పెద్ద రబ్బరు ట్యూబులు, 6 తుపాకులు, 32 కేజీల కెఫిన్‌ అన్‌హైడ్ర్‌స, 17 కేజీల డీఎమ్మార్‌(డెక్సోమెథార్ఫన్‌) స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి ఈ ముఠాతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తామని డీజీపీ చెప్పారు.

Updated Date - Oct 28 , 2024 | 04:02 AM