Share News

Heavy rains: మరో మూడు రోజులు భారీ వర్ష సూచన

ABN , Publish Date - May 18 , 2024 | 11:37 AM

కేరళలోకి ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నెలకొనటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా స్థానిక వాతావరణ కేంద్ర అధికారులు ఈ నెల 20న మూడు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయంటూ ఆ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌(Red alert)ను, 21వ తేదీ వరకు నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను, తక్కిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు.

Heavy rains: మరో మూడు రోజులు భారీ వర్ష సూచన

- 3 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

చెన్నై: కేరళలోకి ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం నెలకొనటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అంతే కాకుండా స్థానిక వాతావరణ కేంద్ర అధికారులు ఈ నెల 20న మూడు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయంటూ ఆ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌(Red alert)ను, 21వ తేదీ వరకు నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను, తక్కిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. ఈ నెల 4న ప్రారంభమైన అగ్ని నక్షత్రం ఎండలు పదో తేదీ తర్వాత తీవ్రరూపం దాల్చుతాయని ప్రజలు ఆందోళన చెందారు. అయితే ఊహించని విధంగా దక్షిణ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏర్పడిన సుడిగాలులల కారణంగా దక్షిణాది జిల్లాల్లో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మన్నార్‌జలసంధి, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రమంతటా అకాల వర్షాలు కురుస్తున్నాయి.


ఇధికూడా చదవండి: AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు..

మూడు జిల్లాల్లో కుండపోత

రాష్ట్రంలో తంజావూరు, పుదుకోట, శివగంగ(Thanjavur, Pudukota, Sivaganga) జిల్లాల్లో ఈ నెల 20న కుండపోత వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం అధికారులు ఆ మూడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. ఆ జిల్లాల్లో 20 సెం.మీల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా కన్నియాకుమారి, తిరువారూరు, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో ఈ నెల 18నుంచి 21 వరకు భారీ వర్షాలు కురవనుండటంతో ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. తక్కిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అక్కడ ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతంలోనూ గత మూడు రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం అక్కడి బీచ్‌లో సందర్శకులెవరినీ అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌ తదితర ప్రాంతాల్లోనూ శనివారం నుంచి సోమవారం వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.


చెన్నైలో భారీ వర్షం...

శుక్రవారం వేకువ జాము నుంచి నగరంలో చెదురుమదురుగా చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం ఉదయం 10 గంటల తర్వాత జోరందుకుంది. నగరంలోని రాయపేట, మైలాపూరు, తాంబరం, క్రోంపేట, గిండి, కేకే నగర్‌, వెస్ట్‌ మాంబళం, టి.నగర్‌, తేనాంపేట, కోడంబాక్కం, వడపళని, కోయంబేడు, మధురవాయల్‌, అమింజికరై, పురుషవాక్కం, ప్యారీస్‌ కార్నర్‌, రాయపురం, వాషర్‌మెన్‌ పేట, తిరువొత్తియూరు, మనలి తదితర ప్రాంతాల్లో అరగంటకు పైగా భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులలో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. ఈ అకాల వర్షంతో నగరమంతా చల్లటివాతావరణం నెలకొంది.

ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 11:37 AM