Bombay High Court: కన్నతల్లిని చంపి ఫ్రై చేసుకుని తినేసిన కొడుకు.. ఉరి శిక్షను నిర్ధారించిన హైకోర్టు
ABN , Publish Date - Oct 01 , 2024 | 06:54 PM
కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి 'ఫ్రై' చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను ముంబై హైకోర్టు మంగళవారంనాడు ధ్రువీకరించింది.
ముంబై: కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి 'ఫ్రై' చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను ముంబై హైకోర్టు (Bombay High Court) మంగళవారం సమర్థించింది. 2017లో జరిగిన ఈ ఘటనను 'నరమాంస భక్షణ' (Cannibalism) కేసుగా హైకోర్టు గుర్తిస్తూ దిగువ కోర్టు విధించిన ఉరిశిక్షను ఖాయం చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన సునీల్ కుచ్కోరవి (Sunil Kuchkoravi) అనే వ్యక్తిని సంస్కరించే అవకాశం ఎంతమాత్రం లేదని, అతనికి విధించిన ఉరిశిక్షను ఖాయం చేస్తున్నామని న్యాయమూర్తులు రేవతి మొహితె, ఫృధ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది.
''అత్యంత అరుదైన కేసుల్లో ఒకటైన 'నరమాంసక భక్షణ' కేసుగా ఈ కేసును పరిగణిస్తున్నాం. దోషి కేవలం అతడి తల్లిని హత్య చేయడమే కాదు, ఆమె శరీరం నుంచి మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, పేగులు వంటి కీలకావయవాలను వేరుచేసి వాటిని పాన్‌లో ఉడికించి మరీ తినేశాడు. ఇది నరమాసం భక్షణ కిందకే వస్తుంది. ఇలాంటి ధోరణులు ఉన్నవారిని సంస్కరించే అవకాశం లేదు. ఒకవేళ జైలు శిక్ష విధిస్తే జైలులో కూడా ఇదే తరహా నేరం చేసే అవకాశం ఉంది'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. కుచ్కోరవిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుపరచగా తీర్పును ధర్మాసనం వెలువరించింది.
Ram Rahim: డేరాబాబా మళ్లీ బయటకు... 4 ఏళ్లలో 15వ పెరోల్
ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, కొల్హాపూర్ సిటీలో 2017 ఆగస్టు 28న ఈ పాశవిక హత్య జరిగింది. 63 ఏళ్ల వృద్ధురాలైన యల్లమ్మ రామ కుచ్కోరిని అత్యంత పాశవికంగా సునీల్ హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ముక్కులుగా నరికి పాన్ మీద ఫ్రై చేసుకుని తిన్నాడు. మందు తాగడానికి యల్లమ్మ డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘాతుకానికి అతను పాల్పడ్డాడు. కాగా, ఈ కేసులో నిందితుడికి 2021లో కొల్హాపూర్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ వెంటనే ఎరవాడ జైలుకు (పుణె) అతడిని తరలించారు. తనకు విధించిన మరణశిక్షను సునీల్ కుచ్కోరి హైకోర్టులో సవాలు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..