Share News

High Court: కొడనాడు కేసులో మాజీసీఎంను ఎందుకు ప్రశ్నించకూడదు..

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:12 PM

కొడనాడు హత్య, దోపిడీ కేసులో, అప్పటి ముఖ్యమంత్రి(Chief Minister), అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)ని ఎందుకు విచారించకూడదని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి తీసుకొనేందుకు వెళ్లే నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లో 2017 ఏప్రిల్‌ 23వ తేది ఓం బహదూర్‌ అనే వాచ్‌మాన్‌ హత్యకు గురయ్యాడు.

High Court: కొడనాడు కేసులో మాజీసీఎంను ఎందుకు ప్రశ్నించకూడదు..

- హైకోర్టు

చెన్నై: కొడనాడు హత్య, దోపిడీ కేసులో, అప్పటి ముఖ్యమంత్రి(Chief Minister), అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)ని ఎందుకు విచారించకూడదని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత విశ్రాంతి తీసుకొనేందుకు వెళ్లే నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లో 2017 ఏప్రిల్‌ 23వ తేది ఓం బహదూర్‌ అనే వాచ్‌మాన్‌ హత్యకు గురయ్యాడు. అలాగే, ఎస్టేల్‌లో పలు పత్రాలు దోపిడీకి గురయ్యాయని సోలూర్‌మఠం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నీలగిరి సెషన్స్‌ కోర్టులో ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: TVK: టీవీకేలో కోటికి చేరిన సభ్యత్వాలు


ఈ కేసుకు సంబంధించి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌, నీలగిరి మాజీ కలెక్టర్‌ శంకర్‌, మాజీ ఎంపీ మురలి రమ్య, అన్నాడీఎంకే నేత సజీవన్‌, ఎస్టేట్‌ మేనేజర్‌ రాజన్‌, సునీల్‌ తదితరులను విచారించేందుకు అనుమతి కోరుతూ ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న దీపు, సదీశన్‌, సంతోష్‌ సామి తదితరులు నీలగిరి కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ విచారించిన కోర్టు, ఎస్టేట్‌ మేనేజర్‌ నటరాజన్‌ను మాత్రమే విచారించేందుకు అనుమతిస్తూ, మిగిలిన వారిని విచారించాలనే పిటిషన్‌ను గత ఏప్రిల్‌లో తోసిపుచ్చింది.


nani4.2.jpg

ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ దీపు, సదీశన్‌, సంతోష్ సామి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌లో... ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రమేయంపై సయాన్‌ మాట్లాడిన నేపథ్యంలో, దాని తీవ్రత పరిశీలించడంలో నీలగిరి కోర్టు విఫలమైందన్నారు. జయలలిత మృతి అనంతరం శశికళ, ఇళవరసి నియంత్రణలో కొడనాడు ఎస్టేట్‌ ఉందన్నారు. అందువల్ల, చోరీ సమయంలో తప్పిపోయిన వస్తువుల గురించి వారికి తెలుస్తుందని,


విచారణ బృందం బహిరంగ విచారణ చేయకుండానే ప్రధాన నిందితులను వదిలేసిందని, అందువల్ల నీలగిరి కోర్టు ఉత్తర్వులు కొట్టివేసి, జాబితా నుంచి తొలగించిన వారిని విచారించేందుకు అనుమతించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి వేల్‌మురుగన్‌ ఈ పిటిషన్‌ శుక్రవారం విచారించిన సందర్భంగా ఇప్పుడు సీఎంగా లేని పళనిస్వామిని విపక్షాల సాక్షిగా ఎందుకు విచారించకూడదని ప్రశ్నిస్తూ, తేది ప్రకటించకుండా తీర్పు వాయిదావేశారు.


ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌ ఓ రాబందు..

ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2024 | 12:12 PM