Home Minister: అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో.. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్
ABN , Publish Date - Jan 20 , 2024 | 01:13 PM
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించామని హోం మంత్రి పరమేశ్వర్(Home Minister Parameshwar) తెలిపారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించామని హోం మంత్రి పరమేశ్వర్(Home Minister Parameshwar) తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. శుక్రవారం సదాశివనగర్‌లో నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఇదో సున్నితమైన అంశమన్నారు. అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలను ఆదేశించామన్నారు. పూజలకు ఎటువంటి అభ్యంతరం లేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని సూచించామన్నారు.