Share News

Fake Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేక్ యాప్‌లను ఇలా గుర్తించి, తొలగించుకోండి..

ABN , Publish Date - Dec 09 , 2024 | 02:29 PM

దేశంలో సైబర్ మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు బాధితుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బును దోపిడీ చేస్తున్నారు. అందుకోసం వివిధ వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి యాప్స్ కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.

Fake Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫేక్ యాప్‌లను ఇలా గుర్తించి, తొలగించుకోండి..
fake apps

ప్రస్తుతం దేశంలో సైబర్ క్రైమ్ ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ వందల సంఖ్యలో వస్తున్నాయి. ఈ క్రమంలో నిరక్షరాస్యులు మాత్రమే కాదు, చదువుకున్న వారు సైతం తమ సంపాదనను కోల్పోతున్నారు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ వినియోగించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ఫోన్‌లో ఉన్న హానికరమైన యాప్‌లను ఎలా తొలగించుకోవాలనే విషయాలను సైబర్ నిపుణులు సూచించారు.


వ్యక్తిగత ఫోటోలు

సైబర్ కేటుగాళ్లు బాధితులను స్కామ్ చేయడానికి పలు రకాల యాప్స్ ఉపయోగిస్తున్నారు. దీంతో వారు మీ వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలకు యాక్సెస్ కలిగి ఉంటే వారి ద్వారా బ్లాక్ మెయిల్‌కు గురయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఈ ప్రమాదకరమైన యాప్‌ల గురించి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ మీ స్మార్ట్‌ఫోన్‌లో హానికరమైన యాప్‌ల కోసం ఎలా తనిఖీ చేయాలనే దానిపై ముఖ్యమైన వీడియోను షేర్ చేసింది.


ఈ ప్రమాదకర యాప్‌లను ఎలా స్కాన్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం

1. మీ ఫోన్‌లో Google Play స్టోర్‌ని ఓపెన్ చేయండి

2. ఎగువన కుడి మూలలో ఉన్న మీ ప్రొఫైల్ చిహ్నంపై క్లిక్ చేయండి

3. కనిపించే మెను నుండి "ప్లే ప్రొటెక్ట్" ఆప్షన్ ఎంచుకోండి

4. తదుపరి స్క్రీన్‌లో "స్కాన్"పై క్లిక్ చేయండి

5. అప్పుడు స్కానర్ మీ ఫోన్‌ని తనిఖీ చేస్తుంది.

6. ఆ తర్వాత ఏదైనా హానికరమైన యాప్‌లు కనుగొనబడితే అప్పుడు మీకు స్కానర్ తెలియజేస్తుంది


సురక్షితంగా ఉంచుకోవచ్చు

ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు స్కామ్‌ యాపుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. దీంతోపాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ అంశంపై ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ చురుగ్గా పనిచేస్తోంది. వివిధ గ్రూపులతో సంప్రదింపులు కూడా జరిపామని అధికారులు పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటర్‌కు అవసరమైన మార్పులు చేసే అధికారాన్ని కూడా పరిశీలిస్తున్నారు.


రూ. 10 కోట్లు

నవంబర్ 2024లో ఢిల్లీలో రిటైర్డ్ ఇంజనీర్ సైబర్ మోసానికి గురై రూ. 10 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇంజనీర్ అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు ఆ వ్యక్తిని ఎనిమిది గంటలపాటు డిజిటల్‌గా అరెస్టు చేయగలిగారు. ఈ మోసంలో ఆయన జీవిత పొదుపును మొత్తం లాగేశారు. ఆయన కుటుంబం బాగా చదువుకుంది. విదేశాలలో ఉంది. అయినప్పటికీ కూడా ఈ సైబర్ నేరం నుంచి తప్పించుకోలేకపోయాడు.


ఇవి కూడా చదవండి:

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 09 , 2024 | 02:31 PM