FASTag: జనవరి 31లోపు ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ చేసుకోండిలా...
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:18 AM
వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్‌డేట్‌ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)సూచించింది. ఈ లోపు కేవైసీ పూర్తికాకపోతే తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ డీయాక్టివేట్ అయి బ్లాక్ లిస్ట్ చేయనున్నట్లు NHAI ప్రకటించింది.
ఢిల్లీ: వాహనదారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ లకు సంబంధించి కేవైసీ అప్‌డేట్‌ని ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. జనవరి 31లోపు కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)సూచించింది. ఈ లోపు కేవైసీ పూర్తికాకపోతే తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ డీయాక్టివేట్ అయి బ్లాక్ లిస్ట్ చేయనున్నట్లు NHAI ప్రకటించింది.
అప్‌డేట్ ఇలా చేయండి...
బ్యాంక్-లింక్ అయిన Fastag వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి. తరువాత OTPని నమోదు చేయండి.
My Profile విభాగానికి వెళ్లి KYC ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
అడ్రస్ వివరాలను నింపి. సబ్మిట్ నొక్కండి.
దీంతో KYC పూర్తవుతుంది. KYC పేజీలో మీ స్టేటస్ కనిపిస్తుంది.
ఫాస్టాగ్ స్టేటస్ తెలుసుకోండి
వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫాస్టాగ్ స్టేటస్‌ని తనిఖీ చేయవచ్చు.
సైట్‌లోకి వెళ్లి కుడివైపునకు పైన ఉన్న లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
లాగిన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి.. ఓటీపీ నమోదు చేయండి.
లాగిన్ అయిన తర్వాత, డ్యాష్‌బోర్డ్‌లోని మై ప్రొఫైల్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇందులో FASTag KYC స్టేటస్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో సమర్పించిన ప్రొఫైల్ వివరాలను చూడవచ్చు.
దీనినే బ్యాంక్ వెబ్‌సైట్‌లో కూడా చేయవచ్చు.
KYC కోసం అవసరమైన పత్రాలు
వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
గుర్తింపు రుజువు
చిరునామా రుజువు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
ID, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, ఓటరు ID, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఉపయోగించవచ్చు.
FASTag అంటే...
ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది. హైవేలపై వేగంగా ప్రయాణించే వాహనాలను పర్యవేక్షిస్తుంది. ఇది సదరు వాహన ఫాస్టాగ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ మొత్తాన్ని కట్ చేస్తుంది. తద్వారా నిమిషాలతరబడి టోల్ గేట్‌ల వద్ద వేచిచూసేప్రయాస తప్పుతుంది.
ఫాస్టాగ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగిస్తారు. వాహన విండ్‌స్క్రీన్‌కు ట్యాగ్‌ని ఉంచుతారు. ఇది బ్యాంక్ అకౌంట్ లేదా ప్రీపెయిడ్ కార్డ్‌కి లింక్ అయి ఉంటుంది. ఫాస్టాగ్‌తో కూడిన వాహనం టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నప్పుడు, టోల్ సిబ్బంది వద్ద ఉన్న స్కానర్‌తో విండోకి ఉన్న ట్యాగ్‌ని స్కాన్ చేస్తారు. దీంతో సదరు టోల్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఇలా టోల్ గేట్‌ల వద్ద రద్దీని తగ్గించడానికి ఫాస్టాగ్ ఉపయోగపడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి