Share News

INDIA bloc: ఇండియా బ్లాక్ భవిష్యత్ గురించి చెప్పలేనన్న చిదంబరం

ABN , Publish Date - Feb 16 , 2024 | 05:04 PM

ఇండియా అలయెన్స్ సంప్రదింపుల కమిటీలో తాను లేనందున కూటమి భవిష్యత్తు గురించి తాను చెప్పలేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. అయితే, నరేంద్ర మోదీ, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆయా రాష్ట్రాలకు చెందిన నిర్దిష్ట ప్రాంతీయ పార్టీలకు గట్టి దెబ్బేనని చెప్పారు.

INDIA bloc: ఇండియా బ్లాక్ భవిష్యత్ గురించి చెప్పలేనన్న చిదంబరం

కోల్‌కతా: ఇండియా (I.N.D.I.A.) అలయెన్స్ సంప్రదింపుల కమిటీలో తాను లేనందున కూటమి భవిష్యత్తు గురించి తాను చెప్పలేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం (P.Chidambaram) అన్నారు. అయితే, నరేంద్ర మోదీ, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆయా రాష్ట్రాలకు చెందిన నిర్దిష్ట ప్రాంతీయ పార్టీలకు గట్టి దెబ్బేనని చెప్పారు. శుక్రవారంనాడు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన సమాధానమిచ్చారు.


లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలోని రామాలయం అంశం ప్రభావంపై అడిగినప్పుడు, అదీ కీలకాంశం అవుతుందా లేదా అనేది కాలమే చెప్పాలని చిదంబరం సమాధామిచ్చారు. ఇండియా కూటమి సంప్రదింపుల కమిటీలో కానీ, ఇండియా బ్లాక్స్ మీటింగ్స్‌లో కానీ తాను లేనందున బ్లాక్ భవిష్యత్తు గురించి చెప్పలేనన్నారు. తన సమాచారం సెకెండ్ హ్యాండ్ లేదా థర్డ్ హ్యాండ్ సమాచారమేనని నవ్వుతూ చెప్పారు. స్థిరమైన, బలంగా వేళ్లూనుకున్న రాజకీయ పార్టీలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేసిందన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 05:04 PM