Share News

Air Force: మహిళా అధికారిపై లైంగిక వేధింపులు, వింగ్ కమాడర్‌పై కేసు

ABN , Publish Date - Sep 10 , 2024 | 07:45 PM

వింగ్ కమాండర్ గత రెండేళ్లుగా తనను వేధిస్తూ లైంగిక దాడులు జరుపుతున్నట్టు పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. 2023 డిసెంబర్ 31న ఆఫీసర్స్ మెస్‌లో కొత్త సంవత్సరం పార్టీ జరిగిందని, గిఫ్ట్ పేరుతో గదికి తీసుకువెళ్లి తనపై లైంగిక దాడి జరిపినట్టు తెలిపింది.

Air Force: మహిళా అధికారిపై లైంగిక వేధింపులు, వింగ్ కమాడర్‌పై కేసు

శ్రీనగర్: భారత వాయుసేనలో (India Air Force) లైంగిక వేధింపుల కేసు వెలుగుచూసింది. జమ్మూకశ్మీర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చెందిన వింగ్ కమాండర్‌ తనపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపిస్తూ జమ్మూకశ్మీర్‌లోనే విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు బుద్గావ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఇద్దరు ఆఫీసర్లను శ్రీనగర్‌కు చెందిన వారుగా గుర్తించారు.

Amit Shah: సైబర్ నేరాలకు ముకుతాడు.. ఐదేళ్లలో 5 వేల సైబర్ కమాండోలు


వింగ్ కమాండర్ గత రెండేళ్లుగా తనను వేధిస్తూ లైంగిక దాడులు జరుపుతున్నట్టు పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. 2023 డిసెంబర్ 31న ఆఫీసర్స్ మెస్‌లో కొత్త సంవత్సరం పార్టీ జరిగిందని, గిఫ్ట్ అందిందా అని ప్రశ్నించిన తన సీనియర్ అధికారి ఆ గిఫ్టులు తన గదిలో ఉన్నాయంటూ అక్కడికి తీసుకువెళ్లి తనపై లైంగిక దాడి జరిపినట్టు తెలిపింది. ఆయన కుటుంబ సభ్యుల గురించి అడిగినప్పుడు వాళ్లు ఎక్కడో ఉన్నారంటూ సమాధానమిచ్చారని పేర్కొంది. అసహజ శృంగారం జరపాలంటూ బలవంతం చేస్తున్నాడని కూడా తెలిపింది. కాగా, ఈ కేసు గురించి తమ దృష్టికి వచ్చిందని, బుద్గాం లోకల్ పోలీసులకు తాము సహకరిస్తున్నామని ఐఏఎఫ్ తెలిపింది. ఇంటర్నల్ ఎంక్వయిరీకి కూడా ఐఏఎఫ్ ఆదేశించింది.


Read More National News and Latest Telugu News Click Here

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 10 , 2024 | 07:45 PM