IAS officers: పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ..
ABN , Publish Date - Jul 02 , 2024 | 12:55 PM
ప్రజాపనులు, జలవనరులు, ఆరోగ్య తదితర కీలక శాఖల ఐఏఎస్ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్మీనా జారీచేసిన ప్రకటనలో... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.మణివాసన్ జలవనరుల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
చెన్నై: ప్రజాపనులు, జలవనరులు, ఆరోగ్య తదితర కీలక శాఖల ఐఏఎస్ అధికారులను(IAS officers) రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్మీనా జారీచేసిన ప్రకటనలో... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.మణివాసన్ జలవనరుల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న డా.చంద్రమోహన్ పర్యాటక శాఖకు బదిలీ అయ్యారు. పశుసంవర్ధక, పాల అభివృద్ధి, మత్స్య, జాలర్ల సంక్షేమ శాఖ కార్యదర్శి మంగత్ రామ్ శర్మ ప్రజాపనుల శాఖకు బదిలీ అయ్యారు. గ్రామీభాభివృద్ధి శాఖ కార్యదర్శి డా.సెంథిల్‌కుమార్ పర్యావరణ శాఖ కార్యదర్శిగా, అటవీ శాఖ కార్యదర్శి సుప్రియ సాహు ఆరోగ్యశాఖకు బదిలీ అయ్యారు. ఆ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న గగన్‌దీ్‌పసింగ్ బేదీ పంచాయతిరాజ్ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ప్రధాన రహదారులు, చిన్న ఓడరేవుల శాఖ కార్యదర్శి ప్రదీప్ యాదవ్ ఉన్నత విద్య శాఖకు,. రహదారుల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెల్వరాజ్ ఆ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఇదికూడా చదవండి: Trains: ప్రత్యేక వారాంతపు రైళ్ల సేవల పొడిగింపు
తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జాన్‌లూయిస్ సామాజిక సాంఘిక శాఖ డైరెక్టర్‌గా, హౌసింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి విజయలక్ష్మి హోమియోపతి డైరెక్టర్‌గా, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరన్ భూముల నిర్వహణ సవరణల శాఖ కమిషనర్‌గా, నగర పాలక తాగునీటి సరఫరా శాఖ మెంబర్ సెక్రటరీగా ఉన్న లిల్లీ రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, జలవనరుల శాఖ కార్యదర్శి సందీప్ సక్సేనా తమిళనాడు పేపర్ కర్మాగారాల చైర్మెన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. పరిశ్రమల పెట్టుబడుల సంస్థ చైర్మెన్ మహేశ్వరన్ తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. సమాచార శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన వైద్యనాధన్ కేబుల్ టీవీ కార్పొరేషన్ చైర్మెన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. వ్యవసాయ శాఖ ఆధునికీకరణ ప్రాజెక్ట్ డైరెక్టర్ జవహర్ సామాజిక సంస్కరణల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని శివదాస్ మీనా తన ఉత్తర్వుల్లో తెలిపారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News