IAS: 14 మంది ఐఏఎస్‌ల బదిలీ..
ABN , Publish Date - Oct 03 , 2024 | 12:28 PM
రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. - ఉన్నత విద్యాశాఖ, రహదారుల శాఖ కార్యదర్శి తదితర ముఖ్య బాధ్యతలు వ్యవహరించిన ప్రదీప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియామకం.
- డీప్యూటీ సీఎం కార్యదర్శిగా ప్రదీప్ యాదవ్
చెన్నై: రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- ఉన్నత విద్యాశాఖ, రహదారుల శాఖ కార్యదర్శి తదితర ముఖ్య బాధ్యతలు వ్యవహరించిన ప్రదీప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియామకం.
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహుకు అదనంగా పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
- అదనపు ప్రధాన కార్యదర్శి గోపాల్ ఉన్నత విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా నియామకం
- తమిళనాడు విద్యుత్ శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించిన రాజేష్ లఖానీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా నియామకం.
- ఉపాధి కల్పన, శిక్షణా శాఖ కమిషనర్ సుందరవల్లి కళాశాల విద్యశాఖ కమిషనర్‌గా నియామకం.
- ఉపాధి అవకాశాల శాఖ డైరెక్టర్‌గా ప్రజాపనుల శాఖ జాయింట్ సెక్రటరీ విష్ణుచంద్రన్ నియామకం.
- చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ అముదవల్లి నియామకం
- సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌గా రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి లిలీ
- జౌళి శాఖ డైరెక్టర్‌గా చెన్నై కార్పొరేషన్ అదనపు కమిషనర్ లలిత .
- పబ్లిక్ సెక్టార్ డిప్యూటీ సెక్రటరీగా తిరుప్పూర్ కార్పొరేషన్ కమిషనర్ పవన్‌కుమార్ నియామకం.
- తమిళనాడు విద్యుత్ బోర్డు ఛైర్మెన్‌గా నందకుమార్ .
- తమిళనాడు చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా చేనేత, జౌళి శాఖ ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ప్రతాప్ యాదవ్ .
- ప్రాజెక్ట్ స్టేడ్ డైరెక్టర్‌గా తమిళనాడు చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు స్వర్ణ రూసా .
- ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ ప్రదీవ్‌రాజ్ చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా నియామకం.
- గతంలో ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేసిన జయకాంతన్‌ను తమిళనాడు వాటర్‌షెడ్ డెవల్‌పమెంట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు.
.................................................................
ఈ వార్తను కూడా చదవండి:
....................................................................
Chennai: తిరుమల గొడుగుల ఊరేగింపు..
చెన్నై: ప్యారీస్‌లోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల(Tirumala) గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల(Tirumala Brahmotsavams) సందర్భంగా నగరానికి చెందిన హిందూ ధర్మార్ధ సమితి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సమితి ఆధ్వర్యంలో ఉదయం 10.20 గంటలకు గొగుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవంలో హిందూ ధర్మార్ధ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్ గోపాల్, నిర్వాహక ధర్మకర్త ఎస్.వేదాంతం, విశ్వ హిందూ పరిషత్ విద్యా కేంద్రం ప్రధాన కార్యదర్శి గిరిజా శేషాద్రి, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ సోమసుందరం తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఉదయం 11.30 గంటలకు గొడుగుల ఊరేగింపు నేతాజీ సుభాస్ చంద్రబోస్ రోడ్డు, గోవిందప్ప నాయకన్ వీధి, భైరాగి మఠం, వాల్టాక్స్ రోడ్డు మీదుగా సాయంత్రం 4 గంటలకు అశేష భక్తజనం మధ్య ఎలిఫెంట్ గేట్ చేరుకుంది. అక్కడి నుంచి చూలై హైరోడ్డు, అవధానం పాపయ్య రోడ్డు, వడమలై వీధి, తానా వీధి, చెల్లప్ప వీధుల మీదుగా రాత్రి అయనావరంలోని కాశి విశ్వనాథ ఆలయం చేరుకుంది. గురువారం విల్లివాక్కం, తిరుముల్లైవాయల్, తిరువళ్లూర్ మీదుగా సాగే ఊరేగింపు ఈ నెల 7వ తేది తిరుమలకు చేరుకుంటుంది. తిరుమల మాఢ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లే గొడుగులను తిరుపతి జీయర్ స్వామి సమక్షంలో టీటీడీ అధికారులకు అప్పగించనున్నట్లు ఆర్‌ఆర్ గోపాల్ తెలిపారు.
ఇదికూడా చదవండి: Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
ఇదికూడా చదవండి: Hyderabad: కేసీఆర్, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఇదికూడా చదవండి: KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?
ఇదికూడా చదవండి: Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్ బెనిఫిట్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
Read Latest Telangana News and National News