Nitin Gadkari: అలా చేస్తే శివాజీ విగ్రహం కూలేది కాదు... నితిన్ గడ్కరి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 04 , 2024 | 03:22 PM
సముద్ర తీరానికి దగ్గరగా బ్రిడ్జిలు నిర్మించేటప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ తప్పనిసరిగా వాడాలని, ఛత్రపతి శివాజీ విగ్రహానికి కూడా ఆ పని చేసుండాల్సిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు.
ముంబై: ఛత్రపతి శివాజీ విగ్రహం (Sivaji Statue) ఇటీవల మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో కుప్పకూలిన ఘటనపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విగ్రహం తయారీకి 'స్టెయిన్‌లెస్ స్టీల్' (Stainless steel) వాడి ఉండాల్సిందని అన్నారు. సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణ పనులకు తుప్పును నిరోధించే స్టెయిన్ స్టీల్ వినియోగించాలని సూచించారు. ఎఫ్ఐసీసీ ఈవెంట్‌లో గడ్కరి మాట్లాడుతూ, సముద్ర తీరానికి దగ్గరగా బ్రిడ్జిలు నిర్మించేటప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ తప్పనిసరిగా వాడాలని, ఛత్రపతి శివాజీ విగ్రహానికి కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ వాడి ఉంటే ఎప్పటికీ కూలిపోయేది కాదని చెప్పారు.
మహారాష్ట్ర మంత్రిగా తాను ఉన్నప్పుడు 55 ఫ్లైఓవర్ల నిర్మాణాలుచేపట్టామని, ఆ సమయంలో ఒక వ్యక్తి ఐరెన్ రాడ్లపై పౌడర్ కోటింగ్ వేస్తూ ఇవి తుప్పుపట్టే అవకాశ లేదని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అయితే అవి తుప్పుపట్టే అవకాశం ఉందని తాను అప్పుడే చెప్పానని తెలిపారు. సముద్ర తీరానికి 30 కిలోమీటర్ల లోపు స్టెయిన్‌లెస్ స్టీల్ వాడాలని తాను బలంగా నమ్ముతానని చెప్పారు.
Vinesh Phogat: వినేశ్ ఫొగట్ సంచలనం.. ఆ పార్టీలో చేరిక
పదిహేడవ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహం గత నెల ఆగస్టు 26న కూలిపోయింది. దీనిపై ప్రభుత్వ జవాబుదారీతనాన్ని విపక్షాలు ప్రశ్నించారు. ఇందుకు స్పందనగా, ప్రధాన నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమత్రి అజిత్ పవార్‌లు క్షమాపణలు తెలిపారు. ఈ ఘటన అనంతరం విగ్రహ శిల్పి జయదీప్ ఆప్టే పరారీలో ఉండటంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Read More National News and Latest Telugu New