Share News

IMD: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ABN , Publish Date - Sep 27 , 2024 | 08:01 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో వర్షాలు ప్రధానంగా ఏయే రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉంది, ఎక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారనే విషయాలను ఇక్కడ చుద్దాం.

IMD: ఐఎండీ రెయిన్ అలర్ట్.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
imd rain forecast

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండం వల్ల వచ్చే 12 గంటల్లో మళ్లీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీతో సహా 8 రాష్ట్రాల్లో భారీ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఛాన్స్ ఉండగా, మరో 9 రాష్ట్రాల్లో సాధారణ వర్షం కురిసే అవకాశం ఉంది. కొండ ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.


ఈ రాష్ట్రాల్లో నేడు వర్షాలు

వాతావరణ శాఖ ప్రకారం నేడు గుజరాత్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. మరోవైపు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఇది కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, పంజాబ్, ఉత్తర హర్యానా, తూర్పు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. జమ్మూ కశ్మీర్, లడఖ్, ఢిల్లీ, కేరళ, లక్షద్వీప్‌లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Minimum Wages: పండుగలకు ముందే కార్మికులకు గుడ్ న్యూస్.. కనీస వేతనం పెంపు


రెడ్ అలర్ట్

వాతావరణ శాఖ ప్రకారం వాయుగుండం బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉంది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్, కొంకణ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం యావత్ దేశంపై ప్రభావం చూపుతోంది. ఈ ఉదయం ఢిల్లీలో బలమైన గాలులు వీచడంతో ఆకాశం దట్టమై మేఘావృతమైంది. భారీ వర్షాల హెచ్చరిక లేనప్పటికీ, ఈరోజు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండవచ్చు. రేపు కూడా రాజధానిలో ఇదే వాతావరణం కొనసాగుతుంది. నేడు థానేలో ఎల్లో అలర్ట్, రాయ్‌గఢ్ జిల్లాలో ఎల్లో అలర్ట్, ముంబైలో రెడ్ అలర్ట్ ఉంటుందని ఐఎండీ ప్రకటించింది.


తెలుగు రాష్ట్రాల్లో

ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా నేడు, రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ క్రమంలో వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాచలం, కామారెడ్డి, నిర్మల్‌, జగిత్యాల, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 27 , 2024 | 08:05 AM