Share News

Rain Alert: ఐఎండీ అలర్ట్.. వచ్చే 3 రోజులు మళ్లీ వర్షాలు

ABN , Publish Date - Sep 22 , 2024 | 08:14 AM

దేశవ్యాప్తంగా నేటితోపాటు వచ్చే మూడురోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఏయే ప్రాంతాల్లో వానలు ఉన్నాయో తెలుసుకుందాం.

Rain Alert: ఐఎండీ అలర్ట్.. వచ్చే 3 రోజులు మళ్లీ వర్షాలు
IMD rain Alert 16 states of india

ప్రస్తుతం యాగీ తుపాను ప్రభావంతో భారత్‌లో పలుచోట్ల వర్షాలు(rains) కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 30 నాటికి రుతుపవనాలు పూర్తిగా తిరుగుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. కాగా రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, గుజరాత్ సహా కోస్తా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది.


నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఈ క్రమంలోనే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రాంతాలతో పాటు ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాలలో కూడా వానలు పడతాయని అంచనా వేసింది. దీంతోపాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం సూచనలు ఉన్నాయి.


వచ్చే మూడు రోజులు

ఈ నేపథ్యంలో వచ్చే 3 రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేకున్నా, చిన్నపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. దీంతోపాటు వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు కురియనున్నాయి. ఇక సెప్టెంబరు 25, 26 తేదీల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది.

500 శిబిరాల్లో

పశ్చిమ బెంగాల్‌ వరదల వలయంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గినప్పటికీ, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చాలా భాగం ఇప్పటికీ నీటిలో మునిగిపోయింది. హౌరా, హుగ్లీ, పశ్చిమ మేదినీపూర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. వరదల్లో చిక్కుకున్న ప్రజలు సహాయక శిబిరాల్లో గడుపుతున్నారు. ప్రస్తుతం 500 సహాయక శిబిరాల్లో 10,000 మందికి పైగా ప్రజలు తలదాచుకున్నారు.


వర్షాల ప్రభావం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని 21 జిల్లాల్లోని 500కు పైగా గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. గంగా, యమున, ఘఘ్రా, శారదా, సరయూ నదులు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. షాజహాన్‌పూర్‌లోని రాష్ట్ర రహదారిపై నీరు ప్రవహిస్తోంది. నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీహార్‌లో వర్షాల కారణంగా భాగల్‌పూర్, ముంగేర్, బెగుసరాయ్‌లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముంగేర్‌లోని చండికా గర్భగుడి, పాట్నాలోని NH-31, భాగల్‌పూర్‌లోని తిల్కామాంఝీ విశ్వవిద్యాలయం నీటిలో మునిగిపోయాయి.


ఇవి కూడా చదవండి:

Narendra Modi: గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన


Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే


Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 22 , 2024 | 08:24 AM