Share News

Central Government : ఈ-గేట్‌తో ఇమిగ్రేషన్‌!

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:49 AM

దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ సేవలను మరింత వేగంగా అందించటానికి వీలుగా కేంద్రప్రభుత్వం ‘ఫాస్ట్‌ ట్రాక్‌ ఇమిగ్రేషన్‌-ట్రస్టెడ్‌ ట్రావెలర్‌ ప్రోగామ్‌’ (ఎఫ్‌టీఐ-టీటీపీ).....

Central Government : ఈ-గేట్‌తో ఇమిగ్రేషన్‌!

  • సులువు కానున్న అంతర్జాతీయ ప్రయాణాలు

  • తనిఖీలు, క్యూలు లేకుండా.. స్వీయ ధ్రువీకరణ

  • కొత్తగా అమలులోకి ఎఫ్‌టీఐ-టీటీపీ పథకం

  • ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

  • హైదరాబాద్‌తోపాటు 7 విమానాశ్రయాల్లో..

  • పత్రాలు, బయోమెట్రిక్‌ సమాచారంతో

  • ప్రయాణికుల వివరాలు ముందుగానే నమోదు

  • ఎయిర్‌ పోర్టులో తనిఖీలు, క్యూలు లేకుండా స్వీయ ధ్రువీకరణ

న్యూఢిల్లీ, జూన్‌ 22: దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఇమిగ్రేషన్‌ సేవలను మరింత వేగంగా అందించటానికి వీలుగా కేంద్రప్రభుత్వం ‘ఫాస్ట్‌ ట్రాక్‌ ఇమిగ్రేషన్‌-ట్రస్టెడ్‌ ట్రావెలర్‌ ప్రోగామ్‌’ (ఎఫ్‌టీఐ-టీటీపీ) అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు ఇకపై మరింత సులువు కానున్నాయి. ఎఫ్‌టీఐ-టీటీపీని దేశంలోని 21 ప్రధాన విమానాశ్రయాల్లో అమలు చేయనున్నారు. తొలిదశలో భాగంగా హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, కొచి, అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుల్లో తీసుకొస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం ఎఫ్‌టీఐ-టీటీపీని ప్రారంభించారు.

భారతీయ పౌరులకు, ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డుహోల్డర్లకు ఈ సదుపాయం ఉచితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాగా, ఎఫ్‌టీఐ-టీటీపీ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రప్రభుత్వంwww.ftuittp.mha.gov.in అనే వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసింది.


దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత నిర్ణీత తేదీ, సమయంలో సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో లేదా ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీ్‌సలో ఇతరత్రా పత్రాలతోపాటు తమ బయోమెట్రిక్‌ (ఫేస్‌, ఫింగర్‌ప్రింట్స్‌) వివరాలను సమర్పించాలి. వీరిని ట్రస్టెడ్‌ ట్రావెలర్స్‌గా వ్యవహరిస్తారు. ఎఫ్‌టీఐ-టీటీపీ అమలయ్యే విమానాశ్రయాల్లో ఈ-గేట్‌లను ఏర్పాటు చేసి, వాటిల్లో ట్రస్టెడ్‌ ట్రావెలర్స్‌ వివరాలను నిక్షిప్తం చేస్తారు. సదరు ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు తనిఖీలు, క్యూ ఏమీ లేకుండానే తమ బోర్డింగ్‌పా్‌సను, పాస్‌పోర్టును ఈ-గేట్‌ వద్ద స్కాన్‌ చేసి, బయోమెట్రిక్‌ వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. అప్పటికే నిక్షిప్తమైన వివరాలతో సరిపోల్చుకొని ఈ-గేట్‌ దానంతట అదే తెర్చుకుంటుంది. దీంతో ఇమిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లే.

Updated Date - Jun 23 , 2024 | 03:49 AM