BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..
ABN , Publish Date - Jun 07 , 2024 | 07:22 AM
లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ(BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కిపైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
జైపుర్: లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ(BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కిపైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అందులో యూపీ వంటి అతి పెద్ద రాష్ట్రంతోపాటు రాజస్థాన్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీకి తగ్గిన ఓట్ల శాతం ఒక్క శాతమే అయినా కొన్ని రాష్ట్రాల్లో ఆ తేడా భారీగా దెబ్బతీసింది. ఆ లోటును మిగిలిన రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవాలని చూసినా అంతగా ఫలితం రాలేదు. దేశంలోనే అత్యధిక ఓట్లను రాజస్థాన్‌లోనే కోల్పోయింది.
ఈ రాష్ట్రంలో 2019తో పోలిస్తే 9.28 శాతం ఓట్లు ఆ పార్టీకి తగ్గాయి. ఫలితంగా 11 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. 2024లో 411. 24 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌కు 1.91 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న జాట్లు ఈసారి కాంగ్రెస్‌కు జై కొట్టారు. వారితోపాటు మీనాలు, గుజ్జరు సామాజిక వర్గాలు కాంగ్రెస్ వెంటే నిలిచారు. రాష్ట్రంలోని 7 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 4 గెలుచుకుని కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తి వేస్తుందని కాంగ్రెస్ చేసిన క్యాంపెయిన్ ఫలించింది.
రేసులోకి కాంగ్రెస్
ఒడిశాలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకోవడంతోపాటు 2019తో పోలిస్తే 6. 96శాతం ఓట్లను బీజేపీ పెంచుకుంది. ఫలితంగా 20 సీట్లు ఒంటరిగా సాధించింది.2019లో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 47 సీట్లను అదనంగా సాధించింది. 6 రాష్ట్రాల్లోనే 36 సీట్లు గెలుచుకుంది. కర్ణాటకలో అత్యధికంగా 13.6శాతం అదనపు ఓట్లను గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ సాధించింది.అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ 8.18 శాతం ఓట్లు నష్టపోయి 30పైచిలుకు సీట్లు సాధించింది. మహారాష్ట్రలో 1.31 శాతం ఓట్లే తగ్గినా సీట్ల పరంగా భారీగా నష్టం కలిగింది.
కర్ణాటకలో 5.32 శాతం ఓట్లను కోల్పోయిన బీజేపీ.. సీట్లు మాత్రం గణనీయంగా సాధించింది. పశ్చిమ బెంగాల్లో 1.52 శాతం, బిహార్ లో 1.11 శాతం, గుజరాత్లో 1.35 శాతం, మధ్యప్రదేశ్‌లో 1.27 శాతం, కేరళలో 3.15 శాతం ఓట్లను కాషాయ పార్టీ కోల్పోయింది.7 రాష్ట్రాల్లో 12 సీట్లను కోల్పోయిన బీజేపీ ఒక్క ఒడిశాలో 12 స్థానాలను అదనంగా సాధించింది.
కశ్మీర్‌లో 2019లో 46.68 శాతం ఓట్లు సాధించినా, 2024లో 24.36 శాతం ఓట్లు పొందింది. అలా జమ్మూ కాశ్మీర్‌లో ఓట్ల శాతం దాదాపు సగానికి తగ్గింది. అయితే బీజేపీ.. కశ్మీర్‌లోని 3 స్థానాల్లో పోటీ చేయలేదు.అలాగే, మణిపూర్‌లో బీజేపీ ఓట్ల శాతం సగానికి పడిపోయింది. అక్కడ ఆ పార్టీ రెండు స్థానాల్లో ఏ ఒక్కటి గెలవలేదు.
16.58 శాతం ఓట్ షేర్‌ను సాధించింది. 2019లో 34.33% ఓట్లతో ఒక సీటు గెలుచుకున్నా.. మణిపుర్ అల్లర్లు అంశం ఆ పార్టీని చాలా దెబ్బ తీశాయి. దీంతో అక్కడ ఉన్న రెండు లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
For Latest News and National News click here