Haryana: బీజేపీకి పెరిగిన బలం.. సావిత్రి జిందాల్ సహా ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు
ABN , Publish Date - Oct 09 , 2024 | 04:19 PM
బీజేపీకి మరింత బలం చేకూరుస్తూ స్వతంత్ర ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేష్ జూన్‌లు బుధవారంనాడు బీజేపీలో చేరారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా గనౌర్ నుంచి కడ్యాన్ పోటీ చేసి గెలుపొందగా, బహదూర్‌గఢ్ నుంచి బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి రాజేష్ జూన్ గెలిచారు.
చండీగఢ్: హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీకి అన్నీ శుభసంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కమలం పార్టీలో బుధవారంనాడు చేరారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన భారతదేశంలోనే అతి సంపన్న మహిళా ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ (Savitri Jindal) సైతం బీజేపీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.
Nayab Singh Saini: విజయోత్సాహంతో మోదీని కలిసిన సీఎం నయబ్ సింగ్ సైనీ
బీజేపీకి మరింత బలం చేకూరుస్తూ స్వతంత్ర ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేష్ జూన్‌లు బుధవారంనాడు బీజేపీలో చేరారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా గనౌర్ నుంచి కడ్యాన్ పోటీ చేసి గెలుపొందగా, బహదూర్‌గఢ్ నుంచి బీజేపీ అభ్యర్థిపై పోటీ చేసి రాజేష్ జూన్ గెలిచారు. వీరురువురూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బదోలి సమక్షంలో హర్యాన్ ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కమలం పార్టీలో చేరారు. కాగా, సావిత్ర జిందాల్ గత మార్చిలో బీజేపీలో చేరినప్పటికీ ఆమెకు పార్టీ టిక్కెట్ రాకపోవడంతో హిసార్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2005, 2009లో ఇదే నియోజకవర్గం నుంచి 74 ఏళ్ల సావిత్రి జిందాల్ గెలుపొందారు. బీజేపీలో ఆమె చేరాలని కోరుకుంటున్నారా అనే దానిపై ఆమెను సంప్రదిస్తునట్టు బదోలి తెలిపారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ మార్క్‌ను దాటేసింది. తాజాగా ఇండిపెండెంట్లు చేరడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరుతోంది. కాగా, 37 సీట్లతో రెండవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించడం లేదని, కౌంటింగ్ ప్రక్రియ అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది.
For More National News and Telugu News..
ఇది కూడా చదవండి..