Share News

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:33 PM

ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు.

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సర సరిహద్దు జవాన్లతో కలిసి దీపావళి పండుగ (Diwali festival) చేసుకోవడం, వారిలో నైతిక స్థైరాన్ని మరింత పెంచుతూ వస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మోదీ బాటలోనే ఆర్మీ ప్రముఖులంతా (Army Top Brass) దేశంలోని పలు సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సాహస జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారు.

Yogi Adityanath: ప్రభుత్వ ఉద్యోగులకు యోగి అదిరిపోయే గిఫ్ట్


డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈసారి పోర్ట్ బ్లెయిర్‌లో అండమాన్ నికోబార్ కమాండ్‌ దళాలతో కలిసి దీపావళి వేడుకలు జరపుకోనున్నారు. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అరుణాచల్ ప్రదేశ్‌కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి వెళ్లారు. అక్కడే వీరు సరిహద్దు బలగాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. నేవీ చీఫ్ అడ్మిర్ ద్వినేష్ త్రివేది గుజరాత్‌లోని పోర్‌బందర్ చేరుకున్నారు. అక్కడి నేవీ సిబ్బందితో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. పాకిస్థాన్ వైపు నుంచి నిషేధిత స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించేందుకు ఈ పోర్ట్ చాలా కీలకంగా ఉంది. భారత వాయిసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈసారి జమ్మూకశ్మీర్ సెక్టార్‌లో బలగాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నారు.


ప్రతి దీపావళి పండుగను సరిహద్దుల్లోని ఫ్రంట్ పోస్ట్ బలగాలతో జరుపుకోవడం ప్రధాని పదేళ్లుగా కొనసాగిస్తుండగా, దసరా పర్వదినాన ఆయుధ పూజ నిర్వహించడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. 2019లో రక్షణ శాఖ మంత్రి ఈ ఆయుధ పూజ ప్రారంభించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి రాఫెల్‌ను ప్రవేశపెట్టేందుకు రాజ్‌నాథ్ ఫ్రాన్స్ వెళ్లివచ్చారు. రాజ్‌నాథ్ బాటలోనే ఆర్మీ చీఫ్ సహా పలువురు సీనియర్ అధికారులు సిక్కిం, పశ్చిమబెంగాల్‌ సహా పలు చోట్ల దసరా వేడుకలను బలగాల మధ్య జరుపుకొన్నారు.


ఇవి కూడా చదవండి..

Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

Arvind Kejriwal: దీపావళికి ఒకరోజు ముందు కేజ్రీవాల్ షాక్

For National News And Telugu News...

Updated Date - Oct 30 , 2024 | 05:33 PM