Jaipur: కాంగ్రెస్ వస్తే అణ్వాయుధాల ధ్వంసమే.. దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందన్న మోదీ
ABN , Publish Date - Apr 12 , 2024 | 05:27 PM
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాలన్నింటిని ఆ పార్టీ ధ్వంసం చేస్తుందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆరోపించారు.
జైపుర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాలన్నింటిని ఆ పార్టీ ధ్వంసం చేస్తుందని ప్రధాని మోదీ(PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆరోపించారు. రాజస్థాన్ రాష్ట్రం బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. "ఇండియా కూటమి(INDIA Bloc) తన చర్యలతో దేశాన్ని బలహీన పరచడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉంది.
ఆ కూటమిలో భాగమైన మరోపార్టీ తన మేనిఫెస్టోలో దేశానికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన ప్రకటన చేసింది. వీరంతా కలిసి అణ్వాయుధాలను నాశనం చేసి.. భారత్‌ను శక్తి హీనంగా మారుస్తారు. దేశ సరిహద్దు జిల్లాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ దేశవ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తుంది. దశాబ్దాలుగా పాలించిన ఆ పార్టీ దేశంలోని ఏ ఒక్క ప్రధాన సమస్యకు పూర్తి పరిష్కారం చూపలేకపోయింది.
భారత్‌ను శక్తిమంతమైన దేశంగా మార్చడంలో నేను బిజీగా ఉండగా, దేశాన్ని బలహీనపరిచేందుకు ఇండియా కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో ఘర్షణలు జరిగితే మౌలిక సదుపాయాలను శత్రువులు ఉపయోగించుకుంటారనే భయంతో అభివృద్ధి పనులను కాంగ్రెస్ విస్మరించింది. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఆయా గ్రామాలను అభివృద్ధి చేశాం. బార్మర్‌లో దాదాపు 1.75 లక్షల మంది పేదలు బీజేపీ ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద లబ్ధి పొందారు" అని మోదీ అన్నారు.
Delhi: డైనోసర్లలాగే కాంగ్రెస్ అంతరిస్తుంది.. రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
రాజస్థాన్‌లో ఎన్నికలు..
రాజస్థాన్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19, 26 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 2014లో రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2019లో బీజేపీ నేతృత్వంలోని కూటమి మొత్తం 25 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ స్వతహాగా 24 స్థానాలు గెలుచుకుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి