ISKCON: ఇస్కాన్ నేత కృష్ణదాస్ అరెస్టుపై భారత్ ఆందోళన
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:13 PM
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.
న్యూఢిల్లీ: ఇస్కాన్ (ISKCON) సంస్థ ప్రముఖ నేత కృష్ణదాస్ ప్రభు అలియాస్ చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్ (Bangladesh) పోలీసులు ఢాకాలో సోమవారంనాడు అరెస్టు చేయడంపై భారత్ స్పందించింది. ఆయనను అరెస్టు చేయడం, బెయిలు నిరాకరించడంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు కొనసాగుతుండటం, నాయబద్ధమైన డిమాండ్ల కోసం పనిచేస్తు్న్న వారిపై అభియోగాలు మోపడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైశ్వాల్ పేర్కొన్నారు. హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పించామని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట
''బంగ్లాదేశ్ సమ్మళిత్ సనాతన్ జార్గాన్ జోతె ప్రతినిధిగా కూడా ఉన్న శ్రీ చిన్మయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేసి బెయిలు నిరాకరించారన్న వార్త మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హిందువులు, ఇతర మైనారిటీలపై బంగ్లాలోని అతివాద శక్తులు పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. మైనారిటీల ఇళ్లలో దోపీడులు, వ్యాపార సంస్థల విధ్వంసం, దేవాలయాలను అప్రవిత్రం చేశారు. ఈ క్రమంలో నిరసనలు తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం దురదష్టకరం" అని భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
కృష్ణదాస్ గత నెలలో ఢాకాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. హిందువులు, మైనారిటీ వర్గాలకు రక్షణ కోరుతూ 8 డిమాండ్లు ప్రభుత్వం ముందుచారు. దీంతో బంగ్లా జెండాను అవమానపరచారనే ఆరోపణపై అక్టోబర్ 30న కృష్ణదాస్‌తో పాటు 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఢాకాలోని హజ్రత్ షాజలాల్ విమానాశ్రయం వద్ద బంగ్లా పోలీసులు సోమవారంనాడు ఆయనను అరెస్టు చేసి అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. అనంతరం ఆరవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం హాజరుపరచగా ఆయన బెయిలు అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆయనను జైలుకు పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణదాస్‌కు బెయిల్ నిరాకరించడంతో కోర్టు వెలుపల పలువురు హిందూ సాధువులు, కృష్ణదాస్ అనుచరులు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’
Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..
Read More National News and Latest Telugu News