Share News

Rajnath Singh: దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదు: రాజ్‌నాథ్

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:13 PM

భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే ఇవాల్డి భౌగోళిక రాజకీయ పరిస్థితుల రీత్యా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పేందుకు భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

Rajnath Singh: దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకూడదు: రాజ్‌నాథ్

లక్నో: యుద్ధానికి సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వివరణ ఇచ్చారు. దేశ శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగరాదనే ఉద్దేశంతోనే తాను ఆ ప్రకటన చేసినట్టు చెప్పారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, భారతదేశ సందేశం 'వసుధైక కుటుబం' అని, భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని అన్నారు. అయితే ఇవాల్డి భౌగోళిక రాజకీయ పరిస్థితుల (Geopolitical situation) రీత్యా దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పేందుకు భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.


"ప్రపంచ దేశాల్లో వసుధైక కుటుంబం సందేశాన్ని ఇచ్చిన ఏకైక దేశం భారత్ ఒక్కటే. ఇండియా ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది. శాంతి సందేశాన్ని చాటుతుంది. అయితే ఇవాళ మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో దేశంలోనూ, ప్రపంచంలోనూ శాంతిని నెలకొల్పాలంటే యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలని సాయుధ బలగాలకు సూచించాను. అలా ఉన్నప్పుడే ఇండియా శాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగదు" అని రాజ్‌నాథ్ వివరించారు.

RSS: మేం దేవుళ్లమో కాదో ప్రజలు నిర్ణయిస్తారు..


శాంతి, స్థిరత్వానికి ఉత్తర సరిహద్దు, పొరుగుదేశాల్లో నెలకొన్న పరిస్థితులు సవాలు విసురుతున్నందున వీటిలో దృష్టిలో ఉంచుకుని సైన్యాధికారులు విస్తతమైన, లోతైన విశ్లేషణ చేయాల్సి ఉందని రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల లక్నోలో జరిగిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశంలో దిశానిర్దేశం చేశారు. రష్యా-ఉక్రెయిన్, గాజా సంక్షోభం, బంగ్లాదేశ్ పరిస్థితులను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తుల్లో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయగలుగుతుతామని, ఊహించని పరిణామాలను దీటుగా ఎదుర్కోగలుగుతామని అన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Sep 06 , 2024 | 04:15 PM