Share News

PM Modi: భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 15 , 2024 | 10:50 AM

న్యూఢిల్లీ: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. వికసిత్ భారత్ థీమ్‌తో హర్ ఘర్ తిరంగా పేరుతో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయని అన్నారు.

PM Modi: భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: 78వ స్వాతంత్ర్య దినోత్సవం (78th Independence Day) సందర్భంగా ఢిల్లీ (Delhi)లోని చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort)లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎర్రకోటపై జాతీయ జెండా (National flag) ఎగురవేశారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. వికసిత్ భారత్ థీమ్‌ (Vikasit Bharat theme)తో హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) పేరుతో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని, దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.


వారికి దేశం రుణపడి ఉంది: ప్రధాని మోదీ

ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందని, శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారని, ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజల కలలను సాకారం చేయాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని అన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. ఈ సందర్బంగా విపత్తు బాధిత కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 2047 నాటికి వికసిత భారత్‌ మనందరి లక్ష్యమని, భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా భారత్‌ను మార్చాలని ప్రధాని అన్నారు.


ఆ స్థాయికి భారత్ ఎదగాలి.. మోదీ

ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత దేశం ఎదగాలని, దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, అలాగే న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్షంలో భారత్‌ స్పేస్ స్టేషన్‌ త్వరలో సాకారం కావాలన్నారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, 'వికసిత్ భారత్‌ 2047' నినాదం.. 140 కోట్ల మంది ప్రజల కలల తీర్మానమని అన్నారు. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలని, వోకల్ ఫర్‌ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహమని, వోకల్ ఫర్‌ లోకల్‌ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పు తెచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


ఆధునిక సాంకేతికతకు పెద్దపీట: మోదీ

సర్జికల్‌ స్టైక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని, అభివృద్ధి బ్లూ ప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 'నేషన్ ఫస్ట్‌.. రాష్ట్ర హిత్‌ సుప్రీం' సంకల్పంతో ముందుకెళ్తున్నామని, బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలుచేశామని చెప్పారు. భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని జల్‌జీవన్‌ మిషన్ ద్వారా 15 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని, భారత్‌లో చిరు ధాన్యాలు ప్రపంచంలో అందరికీ చేరాలని మోదీ ఆకాంక్షించారు. భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందని, దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఉపాథి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామని, యువతకు నూతన ఉపాథి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్నిరంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామని, భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావిస్తుందన్నారు. స్వయం సహాయక రంగాలకు ఇప్పటి వరకు రూ.9 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని, కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ప్రధాని మోదీ

అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందని, వందల కొద్దీ స్టార్టప్‌లు వచ్చాయని, ప్రైవేట్‌ ఉపగ్రహాలు, రాకెట్లు ప్రయోగిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరో 10 కోట్ల మంది మహిళలు.. కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారన్నారు. మౌలిక సదుపాయాల్లో పెను మార్పులు తీసుకొచ్చామని, దేశ హితమే ప్రథమ ప్రాధాన్యమని ఆయన అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని, మన కలలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. నూతన నేర చట్టాల్లో శిక్షల కంటే న్యాయానికే ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వ ప్రమేయం అతితక్కువగా ఉండేలా పౌర సేవలు ఉంటాయని, ఎగుమతుల్లో పురోగతితో ప్రపంచ ప్రగతిలో భారత్ పాత్ర పెరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


విద్య కోసం విదేశాలకు వెళ్లే దుస్థితిని తప్పిస్తాం: మోదీ

జీవన సౌలభ్యమే లక్ష్యంగా ప్రభుత్వ సేవలు అందాలని, ఒకప్పుడు సెల్‌ఫోన్లు దిగమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు భారత్‌లోనే తయారు చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైద్య విద్య కోసం లక్షలు ఖర్చుచేసి విదేశాలకు వెళ్తున్నారని, విద్య కోసం విదేశాలకు వెళ్లే దుస్థితిని తప్పిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు రాబోతున్నాయని తెలిపారు. చంద్రయాన్ ప్రయోగం యువతలో శాస్త్రీయ ఆసక్తిని పెంచిందని, ప్రపంచానికి సేంద్రీయ ఆహారం అందించే స్థాయికి మన రైతులు చేరాలని ప్రధాని ఆకాంక్షించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మోదీ స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. భయపడే పరిస్థితి తీసుకొస్తామన్నారు. ఇండియా 5Gతోనే ఆగదని.. 6Gపైనా అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్‌ హబ్‌గా భారత్‌ను తయారుచేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


బంగ్లాదేశ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని, బంగ్లాలో శాంతి నెలకొల్పేందుకు కృషిచేస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బంగ్లా అల్లర్లతో అల్పసంఖ్యాక వర్గాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వారికి ఏం కాదని భరోసా ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

16 మంది ఏపీ ఐపీఎస్‌లకు డీజీపీ షాక్..

రెండోసారి కంటతడి కంటతడి పెట్టుకున్న మంత్రి

టీటీడీలో 58 మంది ఉద్యోగులకు నోటీసులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 15 , 2024 | 10:50 AM