Share News

Predator drones: అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ డీల్

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:40 PM

మొత్తం 31 డ్రోన్‌లలో 15 డ్రోన్లు నావికాదళానికి సరఫరా అవుతాయి. తక్కిన వాటిని ఆర్మీ, వైమానికి దళానికి సమానంగా విభజించనున్నారు.

Predator drones: అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ డీల్

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ నిఘా సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అమెరికా నుంచి 31 ప్రిడేటర్ డ్రోన్‌ల (Predator drones) కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాలు మంగళవారంనాడు సంతకాలు చేశాయి. రూ.32,000 కోట్లు విలువచేసే ఈ డీల్‌కు క్యాబినెట్ ఆన్ సెక్యూరిటీ (CCS) గతవారంలో అనుమతినిచ్చింది. మొత్తం 31 డ్రోన్‌లలో 15 డ్రోన్లు నావికాదళానికి సరఫరా అవుతాయి. తక్కిన వాటిని ఆర్మీ, వైమానికి దళానికి సమానంగా విభజించనున్నారు.

EVMs: ఈవీఎంలు 100 శాతం ఫుల్‌ప్రూఫ్‌.. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వేళ సీఈసీ


కాగా, ఈ డీల్ కింద భారతదేశంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (ఎంఆర్ఓ) సదుపాయాన్ని కల్పిస్తారు. అమెరికా నుంచి సేకరించే ఈ ప్రిడేటర్ డ్రోన్‌లను చెన్నైలోని ఐఎన్‌ఎస్ రాజాలి, గుజరాత్‌లోని పోర్‌బందర్, సరసావా, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లలో మోహరించనున్నారు. ఈ డీల్‌ను ఖరారు చేసేందుకు అమెరికా మిలటరీ, కార్పొరేట్ ప్రతినిధులు ఇటీవల భారత్ వచ్చారు. అమెరికా నుంచి భారత్ భారీ డీల్‌కు సంబంధించి ఒప్పందాలపై సంతకాల కార్యక్రమంలో రక్షణ, నేవీ శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

ఇది కూడా చదవండి..

కర్ణాటక సీఎం సిద్దూపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు

Updated Date - Oct 15 , 2024 | 03:43 PM