Asia Power Index: జపాన్ను దాటేసిన భారత్.. త్వరలోనే చైనాకు షాక్ ఇవ్వనుందా
ABN , Publish Date - Sep 25 , 2024 | 09:21 PM
యువ శక్తి ఎక్కువుగా ఉన్న భారత్ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్స్లో భారత్ సత్తా చాటింది. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్ ..
భారత్ అన్ని రంగాల్లో రోజురోజుకు బలపడుతోంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచే ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. యువ శక్తి ఎక్కువుగా ఉన్న భారత్ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ఆసియా పవర్ ఇండెక్స్ రీజినల్ పవర్స్లో భారత్ సత్తా చాటింది. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్ అత్యంత శక్తివంతమైన మూడో దేశంగా అవతరించింది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా ఉంది. జపాన్ మూడో స్థానంలో ఉండగా తాజాగా ఆ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది. రానున్న రోజుల్లో చైనాను వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ తన శక్తి, సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక పునరుద్ధరణ, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు భారత శక్తిని మరింత పెంచుతున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలతో మైత్రి కొనసాగిస్తూ ముందుకెళ్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా భారత ఖ్యాతి మరింత పెరుగుతోంది. ఏ దేశానికి లేనట్లు భారత్ ఓ వైపు రష్యాతో, మరోవైపు ఉక్రెయిన్తో స్నేహం చేయగలుగుతోంది. ఈ అంశాలతో పాటు బలమైన ఆర్థిక వృద్ధి, యువత, ప్రాంతీయ భద్రతా విషయాల పరంగా భారత్ ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానానికి చేరుకోగలిగింది.
Chandrababu: బోట్ల ఘటన.. కచ్చితంగా వైసీపీ కుట్రే
2018లో..
ఆసియా పవర్ ఇండెక్స్‌లో అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 2018లో లోవీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్.. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో పవర్ డైనమిక్స్ రేటింగ్స్ ఇస్తోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 27 దేశాలను అంచనా వేసి రేటింగ్స్ రూపొందిస్తోంది. కరోనా కారణంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొంతమేర దెబ్బతిన్న సమయంలోనై భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండంతో పవర్ ఇండెక్స్ రేటింగ్స్ సాధించగలిగింది. ప్రస్తుతం ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారత్ చొరవ తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తే.. ప్రస్తుతం భారత్ ఆ పాత్రను పోషించే స్థాయికి చేరుకుంటోంది.
AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే
చైనాతో పోటీ..
ప్రస్తుతం భారత్ జపాన్ దాటేసిన తరుణంలో తరువాత చైనాతో పోటీపడనుంది. తయారీ రంగంలో మెరుగ్గా ఉండటంతో చైనా ఆర్థి వృద్ధి మెరుగ్గా ఉంది. సాంకేతికతను వినియోగించడంలోనూ ముందు వరుసలో ఉంది. తాజాగా భారత్ సైతం సాంకేతికత వినియోగంలో ముందుండే ప్రయత్నం చేస్తోంది. ఆర్థిక వృద్ధి మెరుగుపర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో చైనాను దాటినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here