Share News

తూర్పు లద్దాఖ్‌లో పూర్వస్థితి

ABN , Publish Date - Nov 02 , 2024 | 04:35 AM

తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్‌, దెప్సాంగ్‌ ప్రాంతాల్లో భారత్‌-చైనా దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో సరిహద్దు గస్తీని పునరుద్ధరించారు.

తూర్పు లద్దాఖ్‌లో పూర్వస్థితి

  • పండుగ వేళ స్వీట్లు పంచుకున్నభారత్‌-చైనా బలగాలు

న్యూఢిల్లీ, నవంబరు 1: తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్‌, దెప్సాంగ్‌ ప్రాంతాల్లో భారత్‌-చైనా దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవడంతో సరిహద్దు గస్తీని పునరుద్ధరించారు. దెమ్‌చోక్‌లో శుక్రవారం నుంచి గస్తీని నిర్వహిస్తోన్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. దెప్సాంగ్‌లో సైతం త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు చెప్పాయి. మరోవైపు నాలుగేళ్లుగా కొనసాగిన ఘర్షణలు సద్దుమణగడంతో దీపావళి పండుగ వేళ వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పలుచోట్ల రెండు దేశాల సైనికులు గురువారం ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. 2020 జూన్‌ 15న గల్వాన్‌ లోయ ప్రాంతంలో బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో నాలుగేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతో్‌షబాబుతో సహా 20 మంది సైనికులు, పలువురు డ్రాగన్‌ సైనికులు మరణించారు. దాంతో రెండు దేశాల సైనికులు ఆ ప్రాంతంలో మోహరించాయి. ఇటీవల కుదిరిన ఒప్పందం మేరకు అక్టోబరు 29 నాటికి బలగాల ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. దీంతో ఎల్‌ఏసీ వెంబడి 2020 నాటి యథాతథా స్థితి కొనసాగనుంది.

Updated Date - Nov 02 , 2024 | 04:37 AM