Indian Railway: రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్..
ABN , Publish Date - Oct 17 , 2024 | 04:19 PM
రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. నవంబర్ 1నుంచి ఈ విధానంలో మార్పులు చేయబోతుంది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు తగ్గించనుంది. దీంతో ఏదైనా రైలు టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే ప్రయాణ తేదీకి..
రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసుకునే గడువులో పలుమార్పులు చేసింది. ఇప్పటివరకు రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. నవంబర్ 1నుంచి ఈ విధానంలో మార్పులు చేయబోతుంది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు తగ్గించనుంది. దీంతో ఏదైనా రైలు టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. భారతీయ రైల్వే తన సేవల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రయాణీకులు కోరుకున్న సీటును వారికి కేటాయించే అవకాశాలు పెరగనున్నాయి. ఈ నిబంధన కేవలం ముందుగా బుక్ చేసుకునే రైల్వే టికెట్లకు మాత్రమే వర్తించనుంది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌తో పాటు భారతీయ రైల్వే రిజర్వేషన్ విధానాన్ని అమలుచేసే అన్ని ట్రైన్లకు వర్తిస్తుంది. గతంలో 90 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తరువాత దీనిని 120 రోజులకు పెంచారు. ప్రస్తుతం సాంకేతికతను జోడించి.. ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ గడువును 60 రోజులకు తగ్గించినట్లు తెలుస్తోంది.
ఎప్పటినుంచి..
రిజర్వేషన్ రైలు టికెట్ల బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే తీసుకొచ్చిన కొత్త నిబంధన నవంబర్1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం నవంబర్1 నుంచి టికెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుంది. నవంబర్1 నుంచి ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు మాత్రమే రిజర్వేషన్ టికెట్‌ను బుక్ చేసుకోగలరు. ఎవరైనా రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించుకోవల్సి ఉంటుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లపై ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపదు. నవంబర్ 1 తర్వాత చేసే బుకింగ్‌లకు మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుంది. సీట్ల కేటాయింపును మెరుగుపరచడంతో పాటు, భారతీయ రైల్వేలో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపర్చడానికి కొత్త విధానం తోడ్పడుతుందని భారతీయ రైల్వే తెలిపింది.
అన్ని రైళ్ళల్లో..
కొత్త విధానం రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని రైళ్ళకు వర్తించనుంది. అన్ని తరగతులకు ఇదే విధానం వర్తిస్తుంది. నాన్ ఏసీతో పాటు ఏసీ తరగతుల్లో రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులు ప్రయాణ తేదీ కంటే 60 రోజుల ముందుగా మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు. రైలు బయలుదేరే స్టేషన్ నుంచి 60 రోజుల ముందు టికెట్ తీసుకోవచ్చు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here