Share News

అక్రమంగా ఉంటున్న భారతీయుల్ని వెనక్కి పంపిన అమెరికా

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:04 AM

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఒక చార్టర్డ్‌ విమానంలో భారత్‌కు పంపినట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స) వెల్లడించింది.

అక్రమంగా ఉంటున్న భారతీయుల్ని వెనక్కి పంపిన అమెరికా

వాషింగ్టన్‌, అక్టోబరు 26: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఒక చార్టర్డ్‌ విమానంలో భారత్‌కు పంపినట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స) వెల్లడించింది. అక్టోబరు 22న వీరిని వెనక్కి పంపామని, భారత ప్రభుత్వ సహకారంతోనే ఇది జరిగిందని శుక్రవారం పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.60 లక్షలకు పైగా అక్రమ వలసదారులను డీహెచ్‌ఎ్‌స వెనక్కి పంపింది. అక్రమ వలసదారులను వెనక్కి పంపడానికి 145కి పైగా దేశాలకు 495కి పైగా అంతర్జాతీయ విమానాలను వినియోగించింది. భారత్‌తోపాటు కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, ఈజిప్ట్‌, మారిటానియా, సెనెగల్‌, ఉజ్బెకిస్థాన్‌, చైనా వంటి దేశాలకు చెందిన వారిని డీహెచ్‌ఎ్‌స వెనక్కి పంపింది. అక్రమ వలసలను తగ్గించడానికి అమెరికా తీసుకుంటున్న చర్యల్లో ఇదీ ఒకటిగా ఉంది.

Updated Date - Oct 27 , 2024 | 04:04 AM